#159

ద్రాక్షావల్లి, తీగెలు

రాగం: శంకరాభరణము (ఛాయ: సర్వ దేశములారా) · తాళం: ఆది · రచయిత: ఎం.జె. రామానుజములు

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
ద్రాక్షావల్లిని నేను – ద్రాక్షాతీగెలు మీరుఅక్షయు డేసటు పలికె అతిముదమునను వినరండి ||ద్రాక్షా||
చరణము 1
నాయందుండని తీగె – నాశనమొందును నిజమునాశనమొందక మీరు – నాయందుండుడు ఫలింపన్ ||ద్రాక్షా||
చరణము 2
ఫలముల నివ్వని తీగె – పనికిరాదని నరికిపారవేయబడును – నిరతము తథ్యము నిప్పులలో ||ద్రాక్షా||
చరణము 3
ఫలించు ప్రతి తీగె – ఫలముల పెక్కుగా నివ్వన్పరిశుద్ధి చేయబడున్ – యెరుగుడి మీరది అనవరతం ||ద్రాక్షా||
చరణము 4
నాయందుండని గాని – నయమగు కాపుండదటన్నాయందుండినవాడు – నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా||
చరణము 5
మీరు ఏదియు చేయ – లేరు నాకు వేరైవేరుగ మీరుండినచో – వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా||
చరణము 6
కాన యేసుని యందు – మానకనుందుము సేవమాన్య యేసుని పలుకులు – మది దలచెదమిల మరువకను ||ద్రాక్షా||