#153

యేసును అనుకరించుట

రాగం: బిలహరి (ఛాయ: మేలుకొనరే) · తాళం: த్రిపుట · రచయిత: ఈతకోట ప్రకాశము

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
నేర్చుకొనరే – యేసువాడుక –లనుదినము మీ బ్రతుకునందుననేర్చుకొనిన – మీరు ఆయన జనుముగ నొప్పెదరు ఇలలో ||నేర్చుకొనరే||
చరణము 1
ఆలయ ఆరాధనలకు – బోయెడి యలవాటుగలిగి – చాలమారులుఆలయమునకు అరిగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||
చరణము 2
దైవవాక్య పఠనమందున – దీక్షగలిగియుమరియు సుతుడు – దివ్యముగ నా గ్రంథ పఠనము జేసిన విధంబు మీరు ||నేర్చుకొనరే||
చరణము 3
పరమ తండ్రికి ప్రార్థనలు – ప్రతివేళ జేయుటపరమ విధియని మరువకను – ప్రార్థించి మనలను నిరతమును ప్రార్థింపమనెను ||నేర్చుకొనరే||
చరణము 4
బీద పాపులు బాధితులు – బంధింపబడినవారి కెల్లను – ఆదరము జూపించి మేలును జేసిన విధంబు మీరు ||నేర్చుకొనరే||
చరణము 5
సువార్త ప్రకటన చేయుట – సుభాగ్యముగ దలంచిఈ భూమి సేవలో సువార్త చాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకొనరే||
చరణము 6
అక్కరలలో దను జేరి – మక్కువతో ప్రార్థించివేడిన పెక్కు జనముల యక్కరలను చక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||
చరణము 7
దైవచిత్తము తీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగియాయన ధరణిలో నా ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే||