#154
ధన్యతలు
పల్లవి · Pallavi
నెవరూ ||నెవరూ||
చరణము 1
కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులుదేవుల బోవ దరిమి యేసు తత్వము గొనువారి కన్న ||నెవరూ||
చరణము 2
దీన మానసుల కట్టి యూప దేశ మిచ్చెను దివ్యమైనమోక్ష రాజ్యము వారిదౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరూ||
చరణము 3
మృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారునిజముగ నోదార్పు బొంది నిత్య సంతోషితులని తెల్పె ||నెవరూ||
చరణము 4
శాంతి నీతి కరుణల యందా సక్తిగలవారు భూస్వాతంత్రులై పరితృప్తినొంది దయ పడసెదరని ప్రభువు తెల్పె ||నెవరూ||
చరణము 5
పరిశుద్ధ హృదయులు పరతత్పరుని జూతురు సర్వనరుల సమాధానపరచు నరులే పరమ జనకుని సుతులు ||నెవరూ||
చరణము 6
నీతి కొరకు హింస నొందెడి నిశ్చలాత్ములు వారు ఖ్యాతిగబరలోక రాజ్య ఘన సౌఖ్యములు ఎల్లను బడయుదురు ||నెవరూ||
చరణము 7
మనసార దేవుని మానక ప్రేమింపు మనచు నేర్పెన్ ఇంకదనబోలె నొరులను దాను ప్రేమింపగ దనర దెల్పెన్ ||నెవరూ||
చరణము 8
తన శిష్యులకు నైక్యమును ప్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చెనెంతో ఘన సత్ప్రభువు కాళ్ళు గడిగి భక్తులచోట వినతుడయ్యెన్ ||నెవరూ||