#152
యేసుక్రీస్తు ప్రత్యక్షత
పల్లవి · Pallavi
కనరే యేసుని ప్రత్యక్షంబు – అన్య – జనులకు గలిగిన విధమెట్లో తరచి ||కనరే||
చరణము 1
నక్షత్ర మార్గాన జ్ఞానుల్ – బోయి – రక్షకుని జూచి రక్తిమీరంగకాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాన్కల్ – కాంతిమీరగ నిచ్చి తరలి పరగన్ ||కనరే||
చరణము 2
పదియు రెండేండ్ల ప్రాయమున – ప్రభువు – పస్కాపండుగనకు బరగబోయెనుగముదముప్పె దేవాలయములో – జేరి – ముద్దుగ బోధించె బోధకులకును ||కనరే||
చరణము 3
కానావూరి పెండ్లికరిగి – ప్రభువు – ఘనముగ నీళ్ళు ద్రాక్షారసముగ జేసెన్తన వర మహిమను బయలుపరచి – శిష్యుల – మనముల బలపరిచె ఘన విశ్వాసమున ||కనరే||
చరణము 4
కుష్ఠరోగి యొక్కడు వచ్చి – తనదు – కుష్ఠరోగము బాప ప్రభుని వేడంగఇష్టమతితో ప్రభువు వాని – ముట్టి కుష్ఠరోగము బాపె కోర్కెలూరంగ ||కనరే||
చరణము 5
శతాధిపతి విశ్వాసమును – ప్రభువు – తరచి చూచి మెచ్చి దయ జూపి కనరేహితముగ వాని దాసుని పక్ష – వాతంబు స్వస్థత మరి గావించెనుగ ||కనరే||
చరణము 6
గాలివానల విప్లవంబు – ప్రభువు – గద్దించి సద్దణచి ఘన మహిమ జూపెగాలి సంద్రముపైన హక్కు – ప్రభునికి గలదంచు శిష్యులు ఘనపరచిరిగ ||కనరే||
చరణము 7
ఇట్టి శక్తిగల ప్రభుని – మనము – గట్టిగ నమ్మిన కలుగు రక్షణముపట్టు వీడక ప్రభుని నెప్పుడు – గొల్చి – పరమ శాంతిని బొంది మరి వెలుగగలము ||కనరే||