#149
క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ
పల్లవి · Pallavi
దేవుని ప్రేమ ఇదిగో – జనులారా – భావంబునందు తెలియరేకేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మన కబ్బునూ ||దేవుని||
చరణము 1
సర్వ లోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెనుసర్వోపకారుడుండ – మన మీధ – జాలిపరుడై యుండెను ||దేవుని||
చరణము 2
మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెనుమన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని||
చరణము 3
యేసుక్రీస్తను పేరున – రక్షకుండు – వెలసినాడిలలోపలదోషకారి జనులతో – నెంతోను – భాషలను పలికినాడు ||దేవుని||
చరణము 4
పాప భారంబుతోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడిపాపులందరూ నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
చరణము 5
సతులైన పురుషులైనను – యా కర్త సర్వ – జనుల యెడలనుసత్ప్రేమగ నడిచెను – పరలోక సద్బోధలక జేసెను ||దేవుని||
చరణము 6
చావు నొందిన కొందరిని – యేసుండు – చక్కగా బ్రతికించెనుసకల వ్యాధుల రోగులు – ప్రభునంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
చరణము 7
గాలి సంద్రపు పొంగులన్ – సద్దణచి – నీళ్ళపైన నడిచినాడుమేలు గల యద్భుతములు – ఈలాగు – వేలకొలదిగ జేసెను ||దేవుని||
చరణము 8
చేతుల కాళ్ళలోను – రార రాజు – చేర మేకులు బొందెనుపాతకులు గొట్టినా రే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
చరణము 9
ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగులందరూ గొట్టిరివడి ముళ్ళు తలమీదను – బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
చరణము 10
ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులనుమన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని||
చరణము 11
రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెనురక్షకుడు మృతి నొందగా – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని||
చరణము 12
రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబునుపాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతులందరూ జూడగా ||దేవుని||
చరణము 13
మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడడునాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున ||దేవుని||
చరణము 14
పదునొకండు మారులు – వారలకు – ప్రత్యక్షమాయె నేసుపరలోకమునకు కేగెను – తన వార్త – బ్రకటించమని పల్కెను ||దేవుని||
చరణము 15
నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణము మరి కలుగునునమ్మనొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||