#150
లాజరును తిరిగి బ్రతికించుట
పల్లవి · Pallavi
వినరే మనుజులారా క్రీస్తు – జడలను జేయు ఘనములైనపనులలోన జిత్రమొక్క – పని వచించెద ||వినరే||
చరణము 1
మన మనంబు లలరుచుండ – దినదినంబు ప్రభుని నిండుఘన మహాద్భుతములు వినిన – దనివి దీరదు ||వినరే||
చరణము 2
ఇలను బేతనియాపురంబు – గలదు మరియ మార్త లక్కచెలियలందు వాసముండి – రెలమితోడను ||వినరే||
చరణము 3
పరిమళంపు తైలమేసు – చరణములకు పూసినట్టిమరియ సోదరుండు రోగ – భరితుడయ్యెను ||వినరే||
చరణము 4
వ్యాధిచేత లాజరుండు – బాధనొందుచుండ గ్రీస్తునాధు బిలువనంప రపుడు – నాతులు ఇరువురు ||వినరే||
చరణము 5
తమ్ముడొక్క చెలియలను బ్రా – యమ్ము తనకు గలిగియుండనమ్మహాత్ముడైన క్రీస్తు – నడిగె నచటికి ||వినరే||
చరణము 6
యేసు వచ్చుటెరిగి మార్త – యెదురుగాను బోయి తనదుదోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు – తోడ బల్కెను ||వినరే||
చరణము 7
కర్త నీకు దేవుడిచ్చు – ఘనబలమెరుగుదును సత్యవర్తి విచట లేని కతన – బ్రాణమొందె లాజరు ||వినరే||
చరణము 8
పదిలపడి మరియ వచ్చి క్రీస్తు – పదయుగమున గొరిగి యేడ్వమొదట మార్త పలికినట్లు – సుదతి పలికెను ||వినరే||
చరణము 9
అపుడు కర్త వారి పలుకు – లాలకించి మదిని మూల్గికృపకు బాత్రురాలితోడ – నపుడు నడిచెను ||వినరే||
చరణము 10
నడిచి లాజరుని సమాధి – కడకు జేరి గుహను మూయబడిన రాయి తీయుడనుచు – ప్రభువు చెప్పెను ||వినరే||
చరణము 11
యేసుతోడ మార్త పలికె – నీ సమాధినుండి నాలుగు వాసరంబులయ్యె గంపు – పట్టి యుండదా ||వినరే||
చరణము 12
దాని నమ్మి చూడమని మహానుభావు – డాత్మబలము నూనితండ్రికపుడు స్తోత్రమొనర – జేసెను ||వినరే||
చరణము 13
లాజరూ సమాధి వెడలి – రమ్ము పొమ్మటంచు లోకపూజితుండు మహా రవమున – బాసి పల్కెను ||వినరే||
చరణము 14
మరణమైనవాడు ప్రాణ – భరితుడగుచు లేచి వచ్చెతరుణులధిక హర్షులైరి – పెద్ద జనముతో ||వినరే||
చరణము 15
కన వినంగరాని యిట్టి – ఘన మహాద్భుతంబు గాంచిజనులు క్రీస్తు యేసు నాధు – ననుసరించిరి ||వినరే||
చరణము 16
కనుక మనము వాని జేర – కొని సుఖంబు బడయవచ్చుమనసు నిలిపి యతనియందు – మనుట మేలగున్ ||వినరే||