చరణము 1
నా యేసు నామ శబ్దము – ఎంతో ఇంపైనదిభయాదులెల్ల దీర్చి విశ్రాంతి నిచ్చును.ఆకలిగొన్న యాత్మకు – అదే మన్నాయగుప్రయాసపడ్డవారికి – ఫలము నిచ్చును.ఈ ప్రియమైన నామము – నిరీక్షణించునునా దుర్గమైన స్థానము – కృపానిలయము.నా యేసు దివ్య నామము – సుక్షేమ నిధియౌనా దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును.యేసూ నీవే నా కాపరి – నా రక్షకా,రాజా, నా ప్రభువా, నా జీవమా! నా స్తుతి పొందుము.నీ ప్రేమ ప్రకటించుదును నా చావు వరకునీ నామ సంకీర్తనము – నన్నాదరించును.