#146

క్రీస్తే రారాజు

రాగం: శంకరాభరణం · తాళం: ఆది · రచయిత: ఎ. చార్లెస్ కిన్సింగర్

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రీస్తేసు శక్తి నామ మెల్లరు – కీర్తించి కొల్వుడెల్లన్ యెప్పుడుకీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||
చరణము 1
సాష్టాంగపడి దూతలు పరమున – నిష్ఠతో గొలుచుచును యేసునికీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||
చరణము 2
హతసాక్ష్యపు జనమా యేసుడే – హితమతితో బిలచుకన్ మిమ్ములకీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||
చరణము 3
ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను – ఆశ్రయ రక్షణను యేసుడేకీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||
చరణము 4
పాపుల రక్షించెన్ సిలువపై – శాపము దొలగించెన్ యేసుడేకీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||
చరణము 5
సర్వ జనంబులారా క్రీస్తుని – సర్వ జగంబులలో రీతిగాకీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||
చరణము 6
పరమందున్నట్టి ప్రభుదగు – పరిశుద్ధ సంఘముతో మనముకీర్తి కిరీటము ధరియింప జేయుచు – క్రీస్తు నాద్యంతము ||క్రీస్తేసు||