#145

యేసే మార్గము

రాగం: మోహన · తాళం: మిశ్రచాపు · రచయిత: ముంగమూరు దేవదాసు

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
నీవే యని నమ్మిక – యేసు నాకు – నీве యని నమ్మికనీవే మార్గంబు – నీవే సత్యంబు – నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే||
చరణము 1
పెడదారిన బోవగ – నా మీదికి – ఇడుములు ఎన్నియో రాగఅడవిలో పడి నేను – ఆడుకొనుచునుండగ – తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే||
చరణము 2
కారుమేఘము పట్టగ – నా మనస్సులో – కటిక చీకటి పుట్టగఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ – తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే||
చరణము 3
లేనిపోని మార్గంబు – లెన్నో యుండ – జ్ఞానోపదేశంబుమానుగ జేయుచు – వానిని ఖండించి – నేనే మార్గమన్న – నిజమైన మార్గంబు ||నీве||
చరణము 4
నరలోకమునుండి పరలోకంబు – వరకు నిచ్చెనగా నుండినరులకు ముందుగా – నడచుచు ముక్తికి – సరిగా కొనిపోవు సు – స్థిరమైన మార్గంబు ||నీవే||