పల్లవి · Pallavi
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారిక్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిలువధారి ||
చరణము 1
ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాతభక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే||
చరణము 2
దివ్య పథంబు రోసి – దైవంబు తోడు బాసిదాసుని రూపు దాల్చి – ధరణికే తెంచె గాన ||క్రీస్తే||
చరణము 3
శాశ్వత లోకవాసి – సత్యామృతం పురాశిశాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే||
చరణము 4
సైతాను జనుల గాల్పన్ – పాతాళమునకు బంపన్నీతి పథంబు బెంప – రుధిరంబు గారె గాన ||క్రీస్తే||
చరణము 5
మృత్యువు ముల్లు త్రుంపన్ – నిత్య జీవంబు బెంపన్మర్యాద భీతి దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే||
చరణము 6
పరమందు విబుధులైన – ధరయందు మనుజులైనప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ||క్రీస్తే||
చరణము 7
ఈ నామమునకు మించు – నామంబు లేదటంచుయెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే||