#143

రారtext యేసు

రాగం: బేహాగ్ · తాళం: ఆది · రచయిత: పి. రవివర్మ

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
రారాజగు యేసు నీ నామం – వర్యంబగు దేవుని నామంఈశుండగు యేసు నీ నామం – ఈ ధర నిధే పావన నామంయేసు నీ నామం – దేవుని నామం – వర్యంబగు దేవుని నామం ||రారాజ||
చరణము 1
గగనము వీడిన గురు నామం – కలుషాత్మల బ్రోచెడు నామం ||రారాజ||
చరణము 2
స్వాంగకముగల యీ నామం – సుజనుల జేసెడు స్థిర నామం ||రారాజ||
చరణము 3
విజయము నొప్పెడు నిజ నామం – విమలాత్మల కిది వర నామం ||రారాజ||
చరణము 4
మనమున కిది యజ్వల నామం – జనుల కిది యే బుజు నామం ||రారాజ||
చరణము 5
ఈ ధర సుతులను కొను నామం – ఈ యేసుని యమృత నామం ||రారాజ||