#142
యేసు నామస్మరణ
పల్లవి · Pallavi
శ్రీ యేసు దివ్య నామస్మరణ – చేయవే మనసాపాయక స్మరియించి పరము – పొందవే మనసా ||శ్రీ||
చరణము 1
నరుల పాప హరణమునకై – నరుడయ్యె మనసాపరమ పుర ద్వారంబు మనకు – తెరచెనే మనసా ||శ్రీ||
చరణము 2
నరుల పాప శాప ఫలము – నరకమే మనసామరణమును తొలంచ ప్రభువే – నుడివెనే మనసా ||శ్రీ||
చరణము 3
పాపమునకు ప్రాయశ్చిత్తం – భవ్యమే గదాప్రభువే ప్రాయశ్చిత్త బలియై – పరగెనే మనసా ||శ్రీ||
చరణము 4
సిలువవేసి ప్రభుని ప్రజలు – చంపరే మనసాబలుడు తిరిగి లేచే మృతిని – గెలిచెనే మనసా ||శ్రీ||
చరణము 5
గెలిచి యేసు హితుల మధ్య – నిలిచెనే మనసానిలిచి సమాధాన ముంచు – పలికెనే మనసా ||శ్రీ||
చరణము 6
పునరుత్థాన మేసు దేవ – పుత్రుడని మహాఘనముగా ప్రకటించుచుండ – కాననే మనసా ||శ్రీ||
చరణము 7
తానే మార్గం తానే సత్యం – తానే జీవముఈ పునః సత్యంబు నమ్ము నరులు – ధన్యులే మనసా ||శ్రీ||
చరణము 8
నిన్ను నీ వెరిగి ప్రభుని – నెరుగవే మనసాసన్నుతుడందుల కొసంగె – సత్య వేదము ||శ్రీ||
చరణము 9
పాపములకు పరితపించి – ప్రభుని జేరవేదాపునకు రమ్మంచు కరము – చాపెనే మనసా ||శ్రీ||
చరణము 10
ఎంత ఘోర పాపమైన – నెంచడే మనసాఎంత మెత్తనైనను క్షమి – యించునే మనసా ||శ్రీ||
చరణము 11
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు మనసాఈ బ్రతుకునందె ప్రభుని పదము – పట్టుకో మనసా ||శ్రీ||
చరణము 12
జనక కుమారాత్మ దేవున్ – జపియించు మనసాఅనయమును స్మరించు స్వర్గ – మదియె మనసా ||శ్రీ||