#141

క్రీస్తు నామమే మన శరణము

రాగం: శ్రీరాగము · తాళం: అట · రచయిత: విలియం డాసన్

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
వర నామమే – శరణము శరణము – క్రీస్తు – వర నామమే – శరణము శరణం ||వర||
చరణము 1
పరమ భక్త వ్రాత – దురిత సంఘాతదుస్తర వన జాత భీ – కర కర హేలియౌ క్రీస్తు ||వర||
చరణము 2
సారహీన సం – సార పారావారతారణ కారణ – తరణియైన క్రీస్తు ||వర||
చరణము 3
యూద దేశమునందు – నుండు బేత్లెహేమునయూదులను జనులలో – పాదుకొన్న క్రీస్తు ||వర||
చరణము 4
ఇలలో పాపపు మాన – వులనెల్ల మోక్షకలితులను జేయగ – సిలువ నొందిన క్రీస్తు ||వర||
చరణము 5
విసిగియున్నట్టి పి – శాచి భారపు కాడిమోసి దుఃఖించెడు – నీచులకును క్రీస్తు ||వర||
చరణము 6
కొల్లగాను బాప – మెల జేసి దానికులములలో దల్ల – డిల్లు వారికి క్రీస్తు ||వర||