#140

యేసునామ మాధుర్యము

రాగం: కాంభోజి · తాళం: ఆది · రచయిత: యోసేపు దానియేలు

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసూ నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యో – దేవమా దోషములను హరించి మోక్షాని – వాసులుగ జేయుటకు భాసుర ప్రకాశమైన ||యేసు||
చరణము 1
వేడుకల రంగ గూడి నిను గొని – యాడెడు వారికి – దేవయెంతో కీడు చేసిన పాడు వైరిని – గోడుగోడనంగ వాని తాడనము జేసితివి ||యేసు||
చరణము 2
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యో – దేవనీ దాపున జేరిన వారి కందరి – కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు||
చరణము 3
అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే – దేవమమ్ము పక్షముగ రక్షించి మోక్షసు – రక్షణకు దీక్ష గొని వీక్షితులమైన మాకు ||యేసు||
చరణము 4
అందమగు నీ మందిరమున – బొందుగా మేము – దేవనీ సుందర కరుణామృతము మా – డెందముల యందు గ్రోలుటకు సుందరమైన ||యేసు||