#138
యేసు నామము పావనము
పల్లవి · Pallavi
యేసు నామమే పావనము – మాకు – యేసుగద నిత్య జీవనముదాస జన హృద్వికాసమై యెల్ల – దోషములకు వినాశకరమైన ||యేసు||
చరణము 1
సాధు మానసోల్లాసములు యేసు – నాధు గుణ దిగ్విలాసములుబోధ గొను వారి బాధ వెడలించి – మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు ||యేసు||
చరణము 2
భక్త జన లోక పూజ్యములు రక్త – సిక్త పాదపయోజములుముక్తి రాజ్యాభిషిక్తుడై సర్వ – శక్తియుతుడైన స్వామియగు క్రీస్తు ||యేసు||
చరణము 3
దీన జన నిత్య తోషణము – సిలువ – మ్రాని ప్రభు మృత్యు పోషణముపానకము వంటి తేనియల స్వాదు – వీనులను గ్రోల మానవులకెల్ల ||యేసు||
చరణము 4
పాపులకు మంచి పక్షములు – ముక్తి – జూపు క్రీస్తు కటాక్షములుపాప సందోహ కూపమున గూలు – కాపురుషు నన్ను గాచుకొని ప్రోచు ||యేసు||