#137

యేసు నామము మధురము

రాగం: మాళవ · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు నామ మెంతో మధురం – యేసు నామ మెంతో మధురందోషములు మోసములు – నాశనమొనరించు ప్రభు ||యేసు||
చరణము 1
స్వాంతమునను శాంతి నిడును – చింతలను భ్రాంతులనువింతలుగా ద్రుంచు ప్రభు ||యేసు||
చరణము 2
నెమ్మి జేయు కమ్మి వేయు – నమ్మికలు సొమ్ములుగాముమ్మరము జేయు ప్రభు ||యేసు||
చరణము 3
ప్రేమ లేదుగదూ క్షేమమొదవదు – కామ గుణ పామరతిలేమి చొరనీడు ప్రభు ||యేసు||
చరణము 4
మోక్ష దశకు సాక్ష్యమొసగు – నక్షయ సురక్షణకుదక్షత వహించు ప్రభు ||యేసు||
చరణము 5
శీల మతుల పాలి వెలయ – తూల జనుదోలి తనజాలి కనపరచు ప్రభు ||యేసు||