#136
వేరొక నామమున రక్షణ లేదు
పల్లవి · Pallavi
యేసు నామామృతము కన్నను – వేరే మాకింక లేదుగాదోషముల నెడబాపి పరమని – వాస పదవికి జేర్చుగా ||యేసు||
చరణము 1
నిత్య రక్షణ నిత్య జీవము – నిజముగా మార్చునుసత్య సువిశేషార్థ సారము – సతతము గ్రోల కోర గనెను ||యేసు||
చరణము 2
దురిత భవమను నంధకారము – దూరముగ దోలంగఅరయగ దన విమలాత్మ వరమున – మరల మమ్ము వెలిగించెగా ||యేసు||
చరణము 3
గొప్ప కుల గర్వముల మెప్పను – తప్పుల నిరడగొట్టెనుచెప్ప శక్యముగాని రక్షణ – సృష్టిలో మమ్ము నిలిపెను ||యేసు||
చరణము 4
అడ్డు పరచు పిశాచి మార్గపు – జిడ్డుల ఛేదించెనుదొడ్డ కాపరి యేసు తనదగు – దొడ్డిలో మమ్ము జేర్చెను ||యేసు||