పల్లవి · Pallavi
రండి సువార్త సునాదముతోరంజిలు సిలువ నినాదముతోతంబుర సితార నాదముతోప్రభుయేసు దయానిధి సన్నిధికి ||రండి||
చరణము 1
యేసే మానవ జాతి వికాసంయేసే మానవ నీతి విలాసంయేసే పతిత పావన నామంభాసుర క్రైస్తవ శుభనామం ||రండి||
చరణము 2
యేసే దేవుని ప్రేమ స్వరూపంయేసే సర్వేశ్వర ప్రతిరూపంయేసే ప్రజాపతి పరమేశంఆశ్రిత జనుముల సుఖవాసం ||రండి||
చరణము 3
యేసే సిలువను మోసిన దైవంయేసే ఆత్మల శాశ్వత జీవంయేసే క్షమాపణ అధికారందాసుల ప్రార్థన సహకారం ||రండి||
చరణము 4
యేసే సంఘములో మన కాంతియేసే హృదయములో పునఃశాంతియేసే కుటుంబ జీవన జ్యోతిపసిపాపల దీవెన మూర్తి ||రండి||
చరణము 5
యేసే జీవన ముక్తికి మార్గంయేసే భక్తుల భూతల స్వర్గంయేసే ప్రపంచ శాంతికి సూత్రంవాసిగ నమ్మిన జనస్తోత్రం ||రండి||