చరణము 1
క్రైస్తవులారా! లేవండి ఈనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుడి ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుడి సువార్త నేను ఎరిగింతును క్రీస్తును మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుడి.
చరణము 2
దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకటించెను: 'ఈ వేళ మహా సంతోషంబగు దావీదు పట్టణమునందు ఈ దినము దైవరక్షకుడు జన్మించెను.'
చరణము 3
త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను 'సర్వోన్నతాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుడి'.