#129
It came upon the midnight clear
చరణము 1
శ్రీ రక్షకుడు పుట్టగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను. 'పరంబునందు స్వామికి మహా ప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనియ్యుడు'.
చరణము 2
ఆ రమ్యమైన గానమీ వేళ మ్రోగును సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరగ ఆ శ్రావ్యమైన గానమీ వేళ విందురు.
చరణము 3
పూర్వంబు దూతగానము భువిని వినంబడి రెండు వేల వర్షములు గతించిపోయెను భూప్రజలు విరోధులై యుద్ధంబులాడియా మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి.
చరణము 4
పాపాత్ములారా, వినుడి శ్రీ యేసు ప్రభువు మీ పాపభారమంతయు వహింప వచ్చెను తాపత్రయంబు నంతయు దానే వహించును సంపూర్ణ శాంతి సంపదలను గ్రహించును.
చరణము 5
సద్భక్తులు స్తుతించిన ఈ సత్య యుగము ఈ వేళనే నిజంబుగా సమీపమాయెను ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండును ఆ దివ్య గానమందరు పాడుచు నెప్పుడు.
చరణము 6
పరమ తండ్రి దయారసము నరుల కెంతో ఆశ్చర్యము నరావతారుడగు దేవుడు నిరపరాధిగాను జీవించి నిరోషమైన త్రోవ చూపించి విరోధులన్ ప్రేమించుచుండెను.
చరణము 7
శ్రీ మాత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము ఈ దినమందుద్భవించిన యా దివ్యకర్తను వీక్షింతుము సదయుడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము.