#131
Joy to the world, The Lord is come
చరణము 1
హల్లే లూయా, లోకమా! ప్రభు వచ్చెన్ అంగీకరించు మీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుడి.
చరణము 2
హల్లే లూయా రక్షకుడు ఏలును సాతాను రాజ్యమున్ నశింపజేసి మా యేసే జయంబు నొందును.
చరణము 3
పాప దుఃఖంబులెల్లను నివృత్తి చేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.
చరణము 4
సునీతి సత్య కృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కండి స్తోత్రార్హుడుడాయెనె.