#125

సుమెయోను పాట

రాగం: శంకరాభరణము · తాళం: త్రిపుట · రచయిత: సమూయేలు భాగ్యవాదము

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
నీ సమాధానము – దాసునికిప్పుడు – నాధా దేవా యిచ్చి – నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||
చరణము 1
అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుగాను – నీకు నణగు ప్రజలైన యిశ్రాయేలు వారికి మహిమ గాను ||నీ సమాధానము||
చరణము 2
నరులకై నీవు ఏర్పరచిన రక్షణను నాధా దేవా – ఇదిగో నా కన్నులు చూచి యానందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||
చరణము 3
తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును గలుగుగాక – మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||