#124
కన్య మరియ పాట
పల్లవి · Pallavi
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘనము చేయుచున్నది – నాదు నాత్మ దేవునందు ఆనందమొందెను నిరతము ||నాదు||
చరణము 1
దేవుడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను – ఈ వసుంధర తరము లన్నియు నెన్నన్ను శుభవతి యని ||నాదు||
చరణము 2
సర్వ శక్తుడు మహాకృత్యము సంభవింప జేసెను – ఉర్విలో నా ప్రభుని నామము ఒప్పి పరిశుద్ధముగా ||నాదు||
చరణము 3
భయము భక్తియు గలిగి దేవుని భజన జేసెడి వారికి – నయముగాను తన కృప నొసంగును నయమును తరతరములు ||నాదు||
చరణము 4
విదిత బాహువు చేత శౌర్యము విభుడు కనపరచెను – హృదయపు దలపులను గర్వుల జెదరగొట్టెను నిజముగా ||నాదు||
చరణము 5
ఆసనాసీనులైయున్న యతిశయాత్ములను బడద్రోసి దేవుడు దీనులను సింహాసనముల నుంచెను ||నాదు||
చరణము 6
క్షుధితులను తన మధురములచే గోరి తృప్తిపరచెను – అధిక ధనవంతులను రిక్త హస్తములతో నంపెను ||నాదు||
చరణము 7
ఆది పితరులైన యబ్రాహాము కతని సంతతికిని – అక్షీణముగ నాదిలోక నా నాడు ఇచ్చినట్లుగా ||నాదు||
చరణము 8
నిరతమును తన కరుణ చూపె నిజముగా మది నెంచెను – వరదుడిశ్రాయేలునకు తన వర సహాయమొనర్చెను ||నాదు||
చరణము 9
పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిక నిహ పరములందును యుగయుగంబుల నెరుగు మహిమ మామేన్ ||నాదు||