చరణము 1
ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెనన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యా ఉత్సాహముతో.
చరణము 2
సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెనన్ మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము.
చరణము 3
ఓ దూతలారా! ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును నుతించుడు పరాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యా ఉత్సాహముతో.
చరణము 4
యేసు! ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రమర్పింతుము అనాది వాక్యమాయె నరరూపు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యా ఉత్సాహముతో.