#116

రారాజు జన్మదినము

రాగం: హిందూస్తాని తోడి · తాళం: ఆది · రచయిత: చెట్టి భానుమూర్తి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
రారే చూదము రాజసుతుడు – రేరేయి జననమాయెను – రాజులకు రారాజు మెస్సీయా – రాజితంబగు తేజమదిగో ||రారే||
చరణము 1
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్యములన్ దెల్పగా – దేవుడే మన దీన రూపాన ధరణి కీ గీదినమున ||రారే||
చరణము 2
కలగలాది కలయుగాది – గొల్ల బోయల దర్శనము – తెల్లగానదె తేజరిల్లెడు – తార గాంచిరి త్వరగ రారే ||రారే||
చరణము 3
బాలుడు వీడు వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు – బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారే||
చరణము 4
యూద వంశమునుద్ధరింప దావీదు పురమున నుద్భవించె – సదమలంబగు మదిని గొలిచిన – సర్వ జనులకు సార్వభౌముడు ||రారే||