#115
బాల యేసుకు గీతాంజలి
పల్లవి · Pallavi
గీతములు పాడుడి యేసునికి సం – గీతములు పాడుడి – పాతకులమగు మనల దారుణ – పాతకము తన విమల రక్త స్నాతులనుగా జేసి పాపను – భ్రాతకులలో నవతరించెను ||గీతములు||
చరణము 1
రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యము కర్తగా – భూజలందుచు దూత పరిగణ పూజితుడై ఘనుడు తన తగిన తేజమెల్లను విడచి యీ యిల దేశహీనులలోన బుట్టెను ||గీతములు||
చరణము 2
దాసులగు వారలన్ దమదు పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల నెల్ల మోక్ష నివాసులుగా జేయంగ రక్తము పోసి కృపచే గావ వచ్చెను – యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు||
చరణము 3
మానవుల కెల్లను దేవుని ప్రేమ మానముగా జూపెను – మ్రానుపై తన రక్తమొసగగ మానవుడై పుట్టె యూదుల లోన యేసును పేరుచే దా దీనుడై యిమ్మానుయేలు ||గీతములు||
చరణము 4
ఆది ధన వాక్యము నందున యేసు మోదముగ నిట్లనె – మేదినిందా మనుజుడై యింక సాదరమున బ్రోవ మనుజుల నా దయాలుడు తనదు దేహము సాధుగా నర్పింతుననుచును ||గీతములు||