#114
జ్ఞానులు క్రీస్తును ఆరాధించుట
పల్లవి · Pallavi
జ్ఞానులారాధించిరి యేసు ప్రభుని – బూని పాపుల బ్రోవ మేనిన్ దాల్చిన తరి ||జ్ఞానులు||
చరణము 1
చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నము గూడి – మేలు మేలని మమ్మేల్నవాడని – మంచి బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞానులు||
చరణము 2
దూరమనక యాత్ర భారమనక బయలు దేరి సంతోషముతో జేరి మేలిమి బంగారమిచ్చి – మనసార నిచ్చి జోహారు జోహారటంచు ||జ్ఞానులు||
చరణము 3
ఈ దివసంబున బేత్లెహేమను నూర – యూదుల రాజుగా బాదుకొన్న యేసు – నాధ స్వామిని సమ్మోదమిమ్మని యూద జనుల మధ్య ||జ్ఞానులు||
చరణము 4
ఈ సమయము మన మా సమయంబుగ జేసి స్తుతింపను జేరితి మిచ్చోట – భాసురంబగు శ్రీ యేసు నాధుని హృదయాసనంబున జేర్చి ||జ్ఞానులు||