#113
క్రీస్తు జన్మదినోత్సవము
పల్లవి · Pallavi
సంతోషించుడి యందరు నాతో – సంతోషించుడి యొక్క వింతయగు కీర్తనన్ పాడ వచ్చితిని – సంతోషించుడి నాతో ||సంతో||
చరణము 1
అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప – దాని యా వేశము దొలగింప – వందితుడు క్రీస్తేసు నాధుడు – వచ్చెన్ బ్రకాశుడై – భూమికి నిచ్చె బ్రకాశంబు ||సంతో||
చరణము 2
కాన నంధకారంబు దొలగ బ్రకాశించెను ఎండలు మీరు ప్రకాశింప రండు – మానవులను సంతోషపరచ నవతరించె – భక్తుల మనము సంతోషించె ||సంతో||
చరణము 3
మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె – హృదయములు దగుల ప్రకాశించె – మునుపు జేయబడిన వాగ్దత్తము – తిన్నగ నెరవేరె భక్తుల కన్నులాస దీరె ||సంతో||
చరణము 4
ప్రీతియైన నీ పండుగ గూర్చి – నూతన కీర్తనను – గలసికొని నాతో పాడుచును – నీ తరి దూరస్థుల కీ వార్తను – నే తీరుననైన దెలుప నాతురపడవలెను ||సంతో||
చరణము 5
పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను లోకమున చూపించవలెను – చూపకపోతే లోపము మనపై మోపబడును నిజముగ – వేగముగ చూపెదమా పదము ||సంతో||