#117
క్రిస్మస్ వర్తమానము
పల్లవి · Pallavi
యేసునాధుని యోధులందరు వాసిగ నిటు రండు – వేగమె వాసిగ నిటు రండు – భాసురముగా ప్రభు జన్మము పాడుచు – నా సతులతో రండు – వేగమె యా సతులతో రండు ||జే జయం||
చరణము 1
దూతల మాదిరి గాత్రము లెత్తుచు గీతము పాడుడి – వేగమె గీతము పాడుడి – దాతయై మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగ బలుకుడి – వేగమె ఖ్యాతిగ బలుకుడి ||జే జయం||
చరణము 2
గొల్లలు ప్రభు కడకేగిన రీతిని నెల్లరు నడువుడి – వేగమె యెల్లరు నడువుడి – ఉల్లములందున సంతోషించి ప్రభు – నెల్లెడ దెలుపుడి – వేగమె యెల్లెడ దెలుపుడి ||జే జయం||
చరణము 3
జ్ఞానుల భంగిని మానవులందరు కానుక లియ్యుడి – వేగమె కానుక లియ్యుడి – మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుడి – వేగమె దానము బొందుడి ||జే జయం||
చరణము 4
మరియ రీతిగను మనసు లోపలను మురియుచు నుండుడి – వేగమె కానుక లియ్యుడి – మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుడి – వేగమె దానము బొందుడి ||జే జయం||
చరణము 5
జయ జయ శబ్దము చేయుచు ప్రభునకు జయమని పాడుడి వేగమె జయమని పాడుడి – జయ జయమంచును జయ శబ్దముతో జయముల నొందుడి – వేగమె జయముల నొందుడి ||జే జయం||