#106

దూత మరియను దర్శించుట

రాగం: ఆనందభైరవి · తాళం: త్రిపుట · రచయిత: పురుషోత్తమ చౌదరి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
వచ్చి గాబ్రియేలు పల్కెను – మరియ – మచ్చకంటి డెంద ముల్కెను – హెచ్చెన శుభముల – నెనలేని కృప దేవుడిచ్చి యింతులలోని – నెన్నెచ్చు జేయునటంచు ||వచ్చి||
చరణము 1
భయము మాటలలో వీడు కన్యకా – నీవు దయ బొందియున్నావు ధన్యగా – రయముగ నిదిగో గర్భమున్ దాల్చెదవు పుత్రు – దయమయి యేసును పేర – తనికడు మంచును ||వచ్చి||
చరణము 2
అతడెన్నబడును మహాత్ముడై – సర్వోన్నతుడైన దైవ కుమారుడై – హితమొప్ప దేవుడు – నల్ను జేసి దావీదు వితత సింహాసన – మతని కిచ్చునంచు ||వచ్చి||
చరణము 3
ఘనతరుడగు వాని రాజ్యము – అంతమొనగూడ దది నిత్య పూజ్యము – వనిత యగు యాకోబు – వంశమెల్లప్పుడేలుకొను నాతడుంచు నని తెల్పెను దూత మరియతో ||వచ్చి||