#107
నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు
పల్లవి · Pallavi
ఉదయించినాడు క్రీస్తుడు నేడు – ఉదయించినాడు విదితమై మరియ నందనుడై ఇమ్మానుయేలు సదయుడై చెడియున్న పృథివికి – నొదవ సమ్మదము అల పిశాచికి మదమణగను సాధు జనుల హృదయముల ముదమెదుగునట్లుగా ||ఉదయించినాడు||
చరణము 1
ఏ విభుని వలన నీ జగమయ్యె – నా విభుడరియలను దైవత్వమగు మనుష్యావతారమున్ దాల్చె – జీవులకు జీవముపై తగ దేవుడును దా నొక్కడు చిరజీవియగు ప్రభు పాపి జీవులను గావ దను చావునకు నొడబడి ||ఉదయించినాడు||
చరణము 2
యూదుల నడుమన్ బెక్కగు భేద భేదములొల్ బొడమగన్ వాదించి ప్రభు రాక గాదంచు మది నెంచి – మీదు జూడని వారి కారుండవారండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ జనమదనుడు దయాలుడు ప్రాణమిడుటకు ||ఉదయించినాడు||