#105

గొల్లల గానము

రాగం: ఆనందభైరవి · తాళం: త్రిపుట

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
రారే గొల్లవారలారా – నేటి రాత్రి బేత్లెహేము నూర – జేరి మోక్షదూత – కోరి తెల్పెను క్రీస్తు – వారి జాడ కన్నులార జూతము వేగ ||రారే||
చరణము 1
పుట్టు చావులు లేనివాడట – పసుల తొట్టిలోపల బుట్టె నిక్కడెనట – ఎట్టి వారలను జేపట్టి పాపము లూడగొట్టి మోక్షపు త్రోవ బెట్టినవాడట వేగ ||రారే||
చరణము 2
బహు కాలమాయెను వింటిమి – నేడు మహిమ కన్పించుట కనుగొంటిమి – విహితముతోడ సేవించి వత్తుము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము ||రారే||