#104
క్రీస్తు నరావతార సందేశము
పల్లవి · Pallavi
వినరే యో నరులారా – వీనుల కిం పు మీర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుడయ్యె – వినరే యే అనుదినమును దేవుని తనయుని పాదముల్.
చరణము 1
నరరూపమున్ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితమున్ బాప దొడ్డ – దొరయై మరియా వరపుత్రుడై కరుణ మరదగిన లీల లలిగి యీ రీతిన్ కరుణను గనరే ||వినరే||
చరణము 2
ఆనందమైన మోక్ష – మందరికియ్య దీక్ష – బూని తన మేని సిలువ – మ్రానును హణించి మృతి బొందెను దీన దయాపరుడైన మహాత్యుడై – జానుగ యాగము సలిపిన తెరంగిది ||vినరే||
చరణము 3
పొందు గోరిన వారి – విందు పరమోపకారి – యెందరెందరి బరమ – నంద పదమొందగ జేసెను అందమున దాన పొంది సురక్షితము – జిందెను భక్తుల – డెందము గుందగ ||వినరే||
చరణము 4
ఇల మాయావాదుల మాని – యితడె సద్గురుడని – తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గల మూలముల నలరెడు ధనికులకు అందలి సుఖములు మరి యొసగును ||వినరే||
చరణము 5
దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి – నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదెంచెను బిరబిరమన మందరమా కరుణానిధి శరణిది చరణమే శరణని పోదము ||వినరే||