ముగింపు
గోడ పూర్తయినప్పుడు (వచనాలు 15, 16) శత్రువులతో సహా అన్యజాతి ప్రజలు కూడా అది దేవుని కార్యమని ఒప్పుకోవలసి వచ్చింది. నెహెమ్యా విషయంలో వలెనే, ప్రభువు మనకు అప్పగించిన కార్యంలో మనం ప్రార్థనాశీలురముగా, నమ్మకంగా ఉండి, శత్రువు దాడులన్నింటినీ లెక్కచేయకుండా పట్టుదలతో కొనసాగితే, విరిగిపోయిన జీవితాలను, విరిగిపోయిన కుటుంబాలను, విరిగిపోయిన సంఘాలను కూడా తిరిగి కట్టడానికి ప్రభువు మనలను వాడుకోగలడు.
ఇలాంటి కార్యం మనలో జరిగినప్పుడు, మన శత్రువులు కూడా దానిని స్వయంగా చూడగలరు, అది ఆయనచేత జరిగినదని దేవుని మహిమ కోసం ప్రకటించకుండా ఉండలేరు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
