ఈ తెలుగు ఎడిషన్ యంత్ర సహాయంతో అనువదించబడింది; సమీక్ష కొనసాగుతోంది. అధ్యయనానికి ఆంగ్ల మూల గ్రంథమే ప్రామాణికం. తప్పులు కనిపిస్తే [email protected]కు రాయండి.

31లో 30వ అధ్యాయం · వ్యాసాలు · తెలుగులో వ్యాసాలు

యబ్బేజు ప్రార్థన

అసలు జ్ఞాపిక పేజీ 177

యబ్బేజు అనగా వేదన అని అర్థం. ఇతను తన సహోదరులందరిలో ఘనత పొంది ఉండెను. వేదన పడి ఇతని కంటినని ఇతని తల్లి యబ్బేజు అని పేరు పెట్టెను. ఇతను ఇశ్రాయేలీయుల దేవుడిని ఇలా మొర్ర పెట్టెను. 1. దిన 4-10, "నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి, నీవు నాకు తోడుగా ఉండు, దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను". అనగా మనం దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఏది అడిగిన మన దేవుడు తన చిత్తములో దానిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ సహోదరులకంటే ఘనముగా ఉన్న వ్యక్తి, కుటుంబములో అన్ని విధాలుగా స్థిరపడిన యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడిపై ఆధారపడవలసిన అవసరం వచ్చింది. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. ఎలాంటి అనుమానాలు లేకుండా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడిగితే మన తండ్రి అయిన దేవుడు, సర్వసృష్టి కర్త, మాట మన నోటికి రాక ముందే మన తలంపులను తెలుసుకునే దేవుడు మనం చేసి ప్రార్థనను అంగీకరించండి. యబ్బేజు గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లుప్తంగా ఉంది కానీ ఇతని ప్రార్థన మాత్రం చాలశక్తికలదిగ కనిపిస్తుంది.

  1. నిశ్చయమైన ఆశీర్వాదము : అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు, మాట తప్పని మహాదేవుడు తనకు ఖచ్చితముగా ఆశీర్వాదము అందించిన యబ్బేజు ప్రార్థన చేసాను. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆదికాండము 12, 2,3, అబ్రహామును దేవుడైన యెహోవా ఈ విధముగా ఆశీర్వదించెను. "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఆ తర్వాత యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా మాటకు లోబడి వెళ్ళిన అబ్రహాము బహు తండ్రి ధనవంతుడిగా, జనములకుగా ఆశీర్వాదం పొందెను.
  1. సరిహద్దులను విశాలపరచడం : యబ్బేజు తన ఆత్మీయ, అనుదిన జీవితంలో వచ్చే శోధనలను, ప్రతికూలపరిస్థితులను ఎదుర్కోవడానికి తండ్రి అయిన దేవుడి జ్యోక్యాన్ని అడిగినట్లు చూడవచ్చు. అవును నిజమే, మన లైఫ్‌లో ఉన్న సమస్యలసరిహద్దులను చెరిపివేయగలశక్తి ప్రార్థనకి ఉంది. కీర్తనలు 138:3, "నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నాప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి". కీర్తనలు 74:17 "భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే" ఇలాంటి గొప్ప సృష్టికర్తను దేవుడిగా, తండ్రిగా కలిగిన మనము ధన్యులము.
  1. దేవుని హస్తము తోడు, కాపుదల : మనం దేవుని కాపుదలలో ఉంటే ఎలాంటి పరిస్థితులలో అయినా జయం పొందగలము. ఉదహరణ : మోషే, అబ్రహాము, యెహోషువా 1:5,6 నీవు బ్రదుకు దినములన్నిటను తను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందును. నిన్ను విడువను, ఎడబాయను.. అనేను, అలాగే మోషే ని గురుంచి సంఖ్యా కాండము12: 3,6 "నా యిల్లు అంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు" అని దేవుడైన యెహోవా చెప్పాడు. ఇలాంటి ధన్యత మన జీవితాలలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా! మరి మనము ఆయన దృష్టికి నిందా రహితులముగా, నిత్య రాజ్యానికి నమ్మకమైన వారసులముగా ఉంటున్నామా ? ఒక్కసారి ఆలోచించాలి.
  1. సమస్త కీడు (పాపము) నుండి విడుదల : దేవుడికి అవమానకరంగా మన జీవితం ఉందా? దైవ సన్నిధి మనలను ఎలాంటి కీడు దూరపరుస్తుంది? దేవునికి విరోధముగా మన క్రియలు, ఆలోచనలు, ఉంటే అది కూడా కీడు కలిగించే అంశమే. ఏసుక్రీస్తు రక్తము ప్రతి కీడు నుండి మనలను పవిత్రపరుచును. సామెతలు 20:22 "కీడుకు ప్రతికీడు చేసెదను అనుకోవద్దు", మనం యెంత పాపులముగా ఉన్ననూ మన ప్రభువు మన యెడలకనికరము కలిగిన వాడై ఉన్నాడు. నిండు మనసుతో మన పాపాలను ఒప్పుకొని, ఆయన దృష్టికి అంగీకారమైన ప్రవర్తన ఉంటే, అబ్రహామును, మోషేను, యబ్బేజును ఆశీర్వదించిన ప్రభువు నేడు మనలను కూడా అదే రీతిగా ఆశీర్వదించడానికి సంసిద్ధతతో ఉన్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడి చిత్తానుసారంగా, ప్రార్థనా పూర్వకంగా చేయునట్లు దేవుడు కృప చూపును గాక!

"యెహోవా కొరకు కనిపెట్టుము ఆయన నిన్ను కనిపెట్టును ఆయన నిన్ను రక్షించును".

ముద్రిత స్మారక సంచికలో ఈ వ్యాసం పాత (నాన్-యూనికోడ్) తెలుగు ఫాంట్‌లో ఉండేది. స్క్రీన్ రీడర్‌ల ద్వారా శోధించడానికి, పరిమాణాన్ని మార్చడానికి మరియు చదవడానికి వీలుగా, ఈ వెబ్ ఎడిషన్ కోసం దీనిని యూనికోడ్ తెలుగులోకి తిరిగి టైప్ చేయడం జరిగింది. అసలైన ముద్రిత పేజీలు కింద పునరుత్పత్తి చేయబడ్డాయి.

View the original printed pages
Home Contents Back to top