🤝 Promises of Trust

78 Bible promises on trust — the Telugu text, the opening of each reflection, and four narrated voices. Open any promise for the full reading in English and Telugu, the reflection and the prayer.

  1. Psalms 118:8

    మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

    People will matter to you all your life, and some will prove wonderfully dependable — yet even the best of them can be late, mistaken, or simply absent when you need them most.

  2. Psalms 56:3

    నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.

    Fear does not disqualify you.

  3. Psalms 9:10

    యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

    Trust grows out of knowing someone, not out of trying harder.

  4. Jeremiah 17:7

    యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.

    Where you place your confidence quietly shapes everything else.

  5. Psalms 37:5

    నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

    Handing a decision to God does not mean doing nothing.

  6. Psalms 20:7

    కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.

    Money, position and useful connections are not evil, but they are thin support when everything shakes.

  7. Psalms 40:4

    గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.

    Where you place your confidence quietly shapes everything else: your sleep, your decisions, your reaction to bad news.

  8. Psalms 62:8

    జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా. )

    Honest prayer does not require tidy words.

  9. Psalms 84:12

    సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.

    Happiness that depends on outcomes rises and falls all week long.

  10. Psalms 125:1

    యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.

    Stability is not something you generate by trying harder.

  11. Proverbs 29:25

    భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.

    Fear of what people think can run a life without ever announcing itself: the opinion never voiced, the decision endlessly postponed.

  12. Isaiah 26:4

    యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

    Human strength runs out, and it was designed to.

  13. 2 Timothy 1:12

    ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.

    It is one thing to believe something about God and another to know Him well enough to hand Him what matters most.

  14. Psalms 13:5

    నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది

    Joy can live alongside unanswered questions.

  15. Psalms 31:14-15

    యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.

    Timing is often the hardest thing to hand over.

  16. Psalms 33:20-21

    మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మికయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.

    Help and protection are two different gifts, and God gives both: one for what you cannot do, the other for what you cannot stop.

  17. Psalms 143:8

    నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.

    Mornings quietly set the tone for whatever follows.

  18. Proverbs 16:20

    ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.

    Wisdom is less about clever thinking and more about paying attention to what God has already said.

  19. 1 Peter 2:6

    ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

    Shame whispers that you will eventually be exposed as not enough.

  20. Psalms 123:2

    దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

    Watching for mercy is its own kind of work.

  21. Isaiah 10:20

    ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.

    One mark of real healing is that you stop leaning on whatever harmed you.

  22. Proverbs 20:22

    కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.

    Revenge promises relief and delivers none of it.

  23. 1 Timothy 6:17

    ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

    Money makes a poor foundation, not because it is evil but because it cannot promise anything.

  24. Hebrews 2:13

    మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

    Even Jesus lived by trust, depending on the Father in the same way He now asks of you.

  25. Jeremiah 49:11

    అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.

    Where a family has lost its protector, God steps into that gap Himself.

  26. Job 24:23

    ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును

    Safety that God gives is real even when it is quiet, and He never looks away from the lives He is holding.

  27. Zephaniah 3:12

    దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.

    Meekness is not timidity; it is strength that has stopped needing to prove itself.

  28. Psalms 138:8

    యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.

    Unfinished things trouble us most — the half-mended relationship, the plan that stalled, the part of yourself you cannot seem to fix.

  29. Isaiah 51:5

    నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు.

    Rescue is already on its way before you can sense it.

  30. Proverbs 28:25

    పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.

    Grasping for more creates conflict wherever it goes, because a heart that must win cannot make peace.

  31. Psalms 146:3

    రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

    Leaders, however capable, are temporary and limited; they cannot see your whole need or outlive their own promises.

  32. Psalms 18:30

    దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.

    The route God chooses is often not the one you would have picked, and it is still perfect, tested by everyone who has ever leaned on it.

  33. Psalms 25:20

    నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.

    Shame is the fear underneath many prayers: that trusting God will leave you looking foolish.

  34. Psalms 31:1

    యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.

    Taking shelter in God is not a last resort after other options fail; it is the wisest first move.

  35. Psalms 32:10

    భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.

    Trouble reaches everyone, but it does not reach everyone the same way.

  36. Psalms 34:8

    యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

    Some things can only be known by trying them.

  37. Psalms 52:8

    నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను

    Roots matter more than weather.

  38. Psalms 62:1

    నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర

    Silence before God is not emptiness; it is the soul settling, letting Him be the one who acts.

  39. Psalms 62:6

    ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.

    If your steadiness depends on circumstances behaving, it will only last as long as they do.

  40. Psalms 64:10

    నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.

    Gladness that survives hard news has to come from somewhere other than good news.

  41. Psalms 71:1

    యెహోవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.

    A whole lifetime of dependence can stand behind a prayer as short as this one.

  42. Psalms 71:6

    గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.

    Before you could speak or choose or believe anything, God was already holding you.

  43. Psalms 86:2

    నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షిం పుము.

    Asking God to protect you is not arrogance; belonging to Him is exactly why you can ask.

  44. Isaiah 59:1

    రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

    Distance from God is never the reason a prayer goes unanswered; His reach has not grown shorter and His hearing has not grown dull, whatever the silence might feel like.

  45. Psalms 25:2

    నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము

    Placing your trust in God is not a guarantee that nothing will go wrong, but it is a guarantee that you will not be left exposed and humiliated in the end.

  46. Psalms 118:2

    ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.

    Some things about God grow stronger in you simply by being said out loud instead of only assumed quietly in your own mind.

  47. Psalms 136:2

    దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

    There is no higher authority behind God that His kindness toward you might depend on; He answers to no one and still chooses mercy anyway.

  48. Psalms 118:3

    ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురు గాక.

    Those closest to God's service are not exempt from needing to say this out loud themselves; even a priest has to keep declaring what is true rather than assuming it.

  49. Psalms 118:4

    ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.

    Reverence for God and confidence in His kindness are not opposites, even though fear sounds like it should cancel out comfort.

  50. Psalms 4:5

    నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి

    Doing what is right and trusting God are placed side by side here, not offered as competing choices.

  51. Zephaniah 3:5

    అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు

    Every morning carries a fresh reminder that God's justice has not gone missing, even in a world that regularly gets away with wrong.

  52. Psalms 115:9

    ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

    Trust is not something you work up inside yourself through effort — it is a decision to lean your weight onto someone who has already proven reliable.

  53. Psalms 118:9

    రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

    Every powerful person or system you might lean on today has limits you cannot always see until it is too late.

  54. Psalms 30:10

    యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము

    Asking plainly for help is not weakness — this is a raw, direct cry from someone who needed God to actually show up, not just sympathize from a distance.

  55. Psalms 115:10

    అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

    This call to trust was first spoken to a family with a specific calling, priests whose job placed them closer to danger and greater responsibility than most.

  56. Psalms 115:11

    యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.

    This invitation to trust is not limited to any one group — it reaches anyone who takes God seriously enough to reverence Him, whatever your background or how new your faith might…

  57. Psalms 55:16

    అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.

    There is no complicated formula for reaching God when you are overwhelmed — you simply call out, and he hears.

  58. 1 Peter 4:19

    కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

    Suffering does not always come with an explanation, but it does not mean you have been abandoned by the one who made you.

  59. Job 37:23

    సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.

    You may never fully grasp how God works, but his greatness is never used against you.

  60. Psalms 73:28

    నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

    Nearness to God is named here as the good thing itself, not a step toward some other reward still waiting to arrive.

  61. Psalms 16:1-2

    దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును

    Whatever good exists in your life right now did not originate with you alone — it traces back to a source outside yourself.

  62. Job 23:6-7

    ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలనశిక్ష నొందకపోవుదును.

    Fear can make God feel like an opponent keeping score against you.

  63. Isaiah 50:7-8

    ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

    Trust does not have to mean the absence of opposition — it means facing it with a steadiness that comes from knowing who is standing beside you.

  64. Psalms 31:7-8

    నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను. నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

    God does not overlook what is troubling you — He takes note of it closely enough to actually do something about it.

  65. Job 5:8-9

    అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

    Handing your case over brings real relief when the One receiving it has a track record of doing things beyond anything you could calculate or explain.

  66. Psalms 22:9-10

    గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.

    Trust in God did not start as something you built as an adult — this verse traces it back to before you could form the thought, to a dependence woven into you from your first…

  67. Proverbs 31:10-11

    గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.

    Real worth is not loud or flashy; it shows up in a steadiness that the people closest to you learn they can rely on completely.

  68. Psalms 19:13-14

    దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక.

    Trust includes asking God to guard you from the sins you would confidently choose yourself, the ones pride makes look reasonable.

  69. Psalms 94:17-18

    యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును. నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

    Without God's quiet, ongoing help, you would have given up long before now, even if you rarely notice it happening.

  70. Psalms 119:57-58

    (హేత్‌)యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.

    Calling God your portion is a way of saying nothing else you are chasing will actually satisfy the way He does, even the things you think you need most.

  71. Psalms 115:1-3

    మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు

    Trust becomes real the moment you stop needing credit for how things turn out and let God simply be God, free to work in ways you would not have chosen yourself.

  72. 2 Corinthians 3:4-6

    క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

    Inadequacy for what is in front of you is not a problem solved by trying harder; the sufficiency you need was never meant to come from inside you alone.

  73. Isaiah 26:7-9

    నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.

    Trust often looks less like certainty and more like waiting — staying oriented toward God even when the path ahead is unclear.

  74. 1 Timothy 4:8-10

    శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మునైయున్నది. మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.

    Effort spent on things that only serve this moment has its place, but the deeper investment — trusting and following God — pays out in both this life and the one beyond it.

  75. 2 Corinthians 1:9-11

    మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

    The moment his own strength ran completely out taught Paul to lean on God instead of himself, and he was not rescued alone — other people's prayers carried him too.

  76. Job 34:10-12

    విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

    It is easy, in confusing circumstances, to wonder whether God is fair.

  77. Psalms 22:2-5

    నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.

    Crying out and not hearing an answer right away is a real, honest experience — even people of deep faith have known that particular ache.

  78. Psalms 136:6-9

    ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును.

    Notice the rhythm of this passage — each act of creation paired with the same repeated truth, that His mercy endures forever.

Telugu text: Bible Society of India Telugu Bible. English text (NKJV) is shown per verse on the promise page, not reproduced here. Reflections and prayers are UECF originals. Audio: the voices recorded for the Daily Bible Promises.