😊 Promises of Joy

145 Bible promises on joy — the Telugu text, the opening of each reflection, and four narrated voices. Open any promise for the full reading in English and Telugu, the reflection and the prayer.

  1. Psalms 16:11

    జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.

    Fullness of joy is located somewhere specific here — in God's presence, not in things finally going well.

  2. John 15:11

    మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.

    Gladness of a particular kind is being offered — not borrowed from good news or good weather, but Christ's own, shared with you.

  3. Psalms 30:5

    ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.

    Nights of weeping are real and are not hurried along by pretending.

  4. Galatians 5:22-23

    అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

    Fruit grows quietly and cannot be forced by effort or willpower.

  5. Psalms 5:11

    నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.

    Joy here grows out of safety.

  6. Psalms 21:6

    నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు.

    Presence, rather than circumstance, is the source of the deepest gladness.

  7. Psalms 100:1-2

    సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.

    Worship is not reserved for people having a good week.

  8. Psalms 126:5

    కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.

    Tears are not wasted ground.

  9. Isaiah 61:10

    శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది

    Picture being handed formal clothes you could never have afforded, and being told to wear them.

  10. Habakkuk 3:18

    నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.

    Even with the harvest gone and the future unclear, joy is still possible — not because circumstances improved, but because God Himself has not changed.

  11. John 16:22

    అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.

    Sorrow has a boundary set by God; it is real, but it does not get the final word.

  12. Romans 14:17

    దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.

    What God is building in you is not measured by rules kept or preferences defended.

  13. 1 Peter 1:8-9

    మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

    Loving someone you have never seen sounds impossible until it happens to you.

  14. Psalms 118:24

    ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

    Today was not an accident and it was not left to chance.

  15. Psalms 4:7

    వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి.

    There is a gladness that money cannot buy and a good year cannot manufacture.

  16. Psalms 43:4

    అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను

    Worship is not a performance you owe God; it is where a downcast heart goes to find Him again.

  17. Psalms 68:3

    నీతిమంతులు సంతోషించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక వారు మహదానందము పొందుదురు గాక

    Gladness before God is not pretending that everything is fine.

  18. Psalms 97:11

    నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.

    Dawn does not arrive all at once.

  19. Proverbs 10:28

    నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.

    Not every hope survives contact with reality.

  20. Isaiah 12:3-4

    కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి.

    Thirst is honest; it tells you exactly what you lack.

  21. Psalms 101:1

    నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.

    Praise grows sturdier when it holds both sides of God — the mercy that spares you and the justice that keeps the world from unravelling.

  22. Isaiah 24:14

    శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్న వారు కేకలువేయుదురు.

    Worship rises from unexpected places, even from distant shores where nobody was listening for it.

  23. Revelation 19:5

    మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.

    Rank disappears in the presence of God.

  24. Luke 1:28

    ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

    Favor from God often arrives with an assignment that frightens more than it flatters.

  25. Ecclesiastes 5:19

    మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదను కొనవలెను.

    The ability to enjoy what you have is itself a gift, not an automatic result of having it.

  26. Hebrews 13:15

    కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

    Praise is called a sacrifice because some days it costs you something.

  27. Jeremiah 31:12

    వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.

    Goodness, not fear, is what draws people back to God.

  28. John 16:21

    స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.

    Pain with a purpose is carried differently from pain without one.

  29. Zechariah 10:7

    ఎఫ్రా యిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టివారు హృదయపూర్వకముగా ఉల్లసించు దురు.

    Joy that comes from God has a way of strengthening a person and spilling over into the next generation.

  30. Acts 2:28

    నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు

    Fullness of joy is tied to a presence, not to circumstances finally lining up.

  31. Galatians 4:27

    ఇందుకుకనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.

    Barrenness of any kind — an empty home, a career that never took, years that produced little — is not the final word in God's arithmetic.

  32. Job 8:21

    నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురుదుష్టుల గుడారము ఇక నిలువకపోవును.

    Grief and strain can put laughter out of reach for a long time, and God does not require you to perform cheerfulness in the meantime.

  33. Joel 2:23

    సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును

    Rain that comes at the right moment is worth more than rain in abundance, and God is precise about His timing.

  34. Matthew 5:12

    సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

    Gladness under opposition makes little sense unless something larger is true.

  35. Proverbs 5:18

    నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.

    Faithfulness to one person across many years is not a narrowing of life but a deepening of it.

  36. Romans 16:27

    అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

    There is a wisdom older and wider than yours, and it is holding the parts of your life you cannot yet make sense of.

  37. Psalms 104:31

    యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక.

    God takes pleasure in what He has made, and that includes you.

  38. Isaiah 25:1

    యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి

    Looking back is sometimes the surest way forward.

  39. Revelation 19:7

    ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.

    Every long wait in Scripture ends in a celebration, and yours is heading somewhere too.

  40. Luke 10:20

    అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.

    It is one thing to be glad about what you accomplish, and quite another to rest in who you are.

  41. Ecclesiastes 5:20

    అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసికొనడు.

    A mind that broods over its own days grows heavy fast.

  42. Hebrews 2:12

    నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను.

    Jesus is not ashamed to call you family, and He worships alongside you rather than watching from a distance.

  43. Jeremiah 31:4

    ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.

    Ruin is not God's last word over anything He loves.

  44. John 16:24

    ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

    You may have grown quiet with God, asking for less and less because asking began to feel useless.

  45. Zechariah 2:10

    సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.

    Nearness is the heart of every promise God makes.

  46. Psalms 104:33

    నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.

    Praise is meant to be a lifelong habit rather than a mood that visits on good days.

  47. Isaiah 30:29

    రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.

    Certain songs are only learned at night.

  48. Revelation 4:8

    ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి - భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును

    Somewhere beyond your sight, worship has never once stopped.

  49. Luke 15:7

    అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.

    Heaven celebrates over one person turning back.

  50. Psalms 104:34

    ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.

    Your quiet thoughts about God are not wasted breath; they are received and enjoyed by Him.

  51. Isaiah 35:2

    అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

    Dry ground does not stay dry forever under God's hand.

  52. Revelation 5:13

    అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.

    Nothing that exists is left out of this song — not the far corners of the sea, not the smallest living thing on earth, and not you.

  53. Psalms 105:3

    ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక.

    Seeking God is itself the beginning of gladness; the joy does not wait until you have found every answer.

  54. Isaiah 38:19

    సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

    Faith is handed on more by living than by lecturing.

  55. Revelation 7:12

    యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.

    When your own words run out, the church's oldest words are waiting for you.

  56. Psalms 106:48

    ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్‌ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.

    Before your story began and long after it ends, God is good.

  57. Isaiah 43:21

    నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.

    Purpose is written into you more deeply than any job title can reach.

  58. Psalms 108:3

    జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను

    Worship carries across borders.

  59. Isaiah 51:11

    యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

    Sorrow has an expiry date, though it rarely feels that way while you are carrying it.

  60. Psalms 109:30

    నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.

    Gratitude spoken aloud does something private thanks cannot.

  61. Isaiah 52:8

    ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.

    Watching and waiting are lonely work until the moment finally arrives.

  62. Psalms 112:1

    యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

    Reverence and delight belong together far more often than we expect.

  63. Isaiah 58:14

    నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

    Delight in God tends to arrive after you clear space for Him, not before.

  64. Psalms 115:18

    మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

    Blessing God is work that outlives the people who do it.

  65. Isaiah 60:5

    నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

    Scarcity teaches you to brace; God's generosity has to be learned slowly.

  66. Psalms 118:19

    నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.

    Access to God is not something you force open; it is asked for and freely granted.

  67. Isaiah 61:7

    మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.

    Shame keeps a long account, but God settles it generously.

  68. Psalms 118:28

    నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.

    Two short words hold everything: my God.

  69. Isaiah 65:18

    నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.

    God is not only repairing the world; He is making something new whose whole character is gladness.

  70. Psalms 119:47

    నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.

    Love changes how instructions feel.

  71. Psalms 119:7

    నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.

    Learning God's ways is slow work, and honesty grows alongside it.

  72. Psalms 122:1

    యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

    Gathering with others to worship is a mercy, not a duty.

  73. Psalms 13:6

    యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.

    Trust often speaks before the situation changes.

  74. Psalms 135:21

    యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.

    Heaven is not a distant address for God; He settles among His people and makes His home there.

  75. Psalms 135:3

    యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.

    Singing to God is good for the one who sings.

  76. Psalms 138:1

    నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.

    Whole-hearted worship means bringing the parts of you that are still unsure, not leaving them outside.

  77. Psalms 145:2

    అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.

    Devotion is built out of repetition, not intensity.

  78. Psalms 145:21

    శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.

    One voice starting is how any chorus begins.

  79. Psalms 145:7

    నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు

    Memory is a spiritual discipline.

  80. Psalms 146:2

    నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

    However many days you are given, none of them are too ordinary for praise.

  81. Psalms 37:4

    యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

    Enjoying God changes what you want.

  82. Psalms 95:1

    రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము

    Singing together does something that thinking alone cannot do.

  83. Psalms 63:7

    నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.

    Remembering past help is what makes present joy possible.

  84. Psalms 9:1

    నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను.

    Telling someone what God has done is one way gratitude stops being just a private feeling and becomes something real.

  85. Psalms 30:1

    యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.

    Being pulled up out of a low place leaves a mark, the kind that turns naturally into gratitude rather than pride.

  86. Psalms 33:1

    నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

    Living honestly before God is not only about avoiding wrong; it also makes room for a kind of joy that dishonesty could never produce.

  87. Psalms 34:1

    నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.

    Gratitude that only shows up when life is easy is not really gratitude, it is convenience.

  88. Psalms 111:1

    యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

    Praise is not only a private matter between you and God; it grows stronger when it is spoken among people who are also trying to live rightly.

  89. Psalms 146:1

    యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

    Some days praise has to be spoken to yourself before it becomes something you actually feel.

  90. Psalms 147:1

    యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.

    Praise is not a chore God extracts from you; it is described here as pleasant, something that actually fits well and feels right when you do it.

  91. Psalms 9:2

    మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.

    Joy in God does not need an external reason to justify it; His name alone, who He is, is enough grounds for gladness.

  92. Psalms 34:2

    యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.

    Boasting usually means drawing attention to yourself, but this is the opposite, a kind of confidence that points entirely away from you and toward what God has done.

  93. Psalms 149:2

    ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.

    Being made by someone is different from being ruled by them, yet here both are reasons for joy rather than resignation.

  94. Philippians 4:4

    ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.

    Saying something twice, the way this does, usually means it needs repeating because it will not come naturally on its own.

  95. Psalms 30:4

    యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.

    Memory shapes worship more than people usually notice; specifically recalling who God has been to you tends to produce more honest gratitude than a vague, general thank you.

  96. Psalms 66:4

    సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును. (సెలా. )

    Every nation eventually owes God this same response, whether offered willingly now or arrived at later under different circumstances.

  97. Psalms 70:4

    నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.

    Those who are actively seeking God are promised gladness, not those who have already arrived at certainty about everything.

  98. Psalms 86:4

    ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.

    Serving God does not mean your own gladness gets set aside for later; He actually delights in making His servants glad, not just useful.

  99. Psalms 92:4

    ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.

    Watching what God has already done tends to produce steadier joy than waiting on what He might do next.

  100. Psalms 63:5

    క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది

    Satisfaction like this does not come from having more of everything; it comes from being genuinely fed by God in the places that actually matter.

  101. Psalms 47:7

    దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

    Singing to God is not meant to be a habit you perform without thinking — it is a response to who He actually is, ruling over every detail of your life whether you feel it or not.

  102. Psalms 35:9

    అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.

    Joy, in God's promise, is not dependent on your circumstances improving first — it rises out of what He has already done to rescue you.

  103. Psalms 57:9

    నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.

    Praise here is not kept inside a small, safe circle; it is aimed outward, toward people who have never even heard your name, because mercy this vast deserves an audience wider…

  104. Psalms 75:9

    నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.

    Choosing to keep praising God is not a feeling you wait to have — it is a decision you renew, the same way generations before you renewed it, tying your story to something bigger…

  105. Isaiah 35:10

    వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

    Joy, in God's promise, does not just sit quietly beside your sorrow — it comes to replace it, sending grief and heavy sighing running the other direction.

  106. Psalms 86:12

    నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను.

    Wholehearted praise is different from the polite, divided kind offered out of habit — this is gratitude that holds nothing back and keeps building rather than fading once the…

  107. Psalms 89:12

    ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.

    Even mountains, in this psalm, cannot help responding to God with something like joy simply because He made them and named them His.

  108. Psalms 97:12

    నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.

    Gratitude, here, is tied to memory — giving thanks specifically at the remembrance of who God is, not just in the good moments but any time His character comes back to mind.

  109. Psalms 79:13

    అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.

    Belonging to God is not a distant idea; you are cared for the way a shepherd watches every single sheep, noticing when one wanders or grows tired.

  110. Psalms 40:16

    నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.

    Joy has a way of following whoever keeps seeking God, even when today does not feel particularly joyful yet.

  111. Psalms 7:17

    యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

    Praise offered here is tied to who God is, his fairness and his greatness, not to whether your particular situation has resolved yet.

  112. Psalms 35:18

    అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

    Notice this is a decision made ahead of time — I will give thanks, stated before the moment even arrives, not left to whatever mood shows up.

  113. Isaiah 29:19

    యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

    Joy in this verse belongs first to people with the least to show for themselves — the humble, the poor — as if empty hands make more room for gladness, not less.

  114. Psalms 71:23

    నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు

    Real joy does not need to be manufactured — it rises on its own when you remember what God has already rescued you from.

  115. Psalms 136:26

    ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

    Thanksgiving here is answering something that never changes, not whatever happened to you today, which means it works just as well on a flat, uneventful afternoon as it does after…

  116. Psalms 69:30

    కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

    Praise is not only what you feel — it can be something you choose to do, a decision to sing before your circumstances fully explain why.

  117. Psalms 18:46

    యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.

    There is something steadying about remembering that God is not a distant idea but a living, active presence you can lean your whole weight on.

  118. Psalms 105:1-2

    యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి

    Thanks here does not stay between you and God; it is meant to be made known, sung, talked about among people who might not otherwise hear it.

  119. Psalms 113:1-2

    యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.

    Being called God's servant is not primarily about tasks to complete — first and foremost it is a name given to someone whose life is meant to praise him.

  120. Psalms 67:3-4

    దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా. ) జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

    Joy here is not blind celebration — it is a response to knowing the one in charge governs fairly, not on a whim.

  121. 1 John 1:4-5

    మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

    Real joy is not fragile happiness that flickers when life gets hard — it comes from what God is like at His core, someone in whom nothing hides and nothing fails.

  122. Psalms 138:4-5

    యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహా ప్రభావముగలవాడని వారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె దరు.

    There is something in God's greatness that draws worship out of people who owe Him nothing — even rulers who answer to no one else bow to what He has said and done.

  123. Isaiah 12:5-6

    యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును. సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.

    Some things are too good to keep quiet about, and what God has done is one of them.

  124. Psalms 45:6-7

    దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు.

    There is a kind of joy that comes from loving what is right and refusing what is not — not a joy that fades with circumstances, but one God pours out generously on those who live…

  125. Matthew 28:7-8

    త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా

    Fear and joy do not always cancel each other out — sometimes they run side by side, the way they did for the women leaving that empty tomb.

  126. Hebrews 1:8-9

    గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.

    This verse pictures Jesus set apart, not by force but by the quality of what He loved and hated, and that same gladness He carries is not hoarded for Himself alone.

  127. Zechariah 9:8-9

    నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగు లాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను. సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.

    God's protection here comes with an unexpected picture of victory — a king arriving not on a warhorse but on a borrowed donkey, humble instead of intimidating.

  128. Psalms 30:11-12

    నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.

    Grief is not the final word God intends for your story; He specializes in turning mourning into something unexpected — a reason to give thanks again.

  129. 1 Peter 4:12-13

    ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

    It is strange comfort, but true: suffering does not mean God has abandoned His plan for you, it can mean you are sharing in something Christ Himself walked through.

  130. Ecclesiastes 3:12-13

    కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.

    Enjoying an ordinary meal or a day's work is not beneath God's notice; it is one of the plain gifts He built into being human.

  131. Matthew 18:12-13

    తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనిన యెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కు వగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    A shepherd does not average his joy across a whole flock; he goes after the one that wandered and celebrates it specifically when it is found.

  132. Zephaniah 3:13-14

    ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు; సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.

    Peace here is not the absence of danger but the presence of God making it unnecessary to be afraid, freeing you to actually sing rather than just survive.

  133. Psalms 89:14-15

    నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.

    God's rule does not rest on shifting ground; it is built on justice and faithful love, solid enough that the people who know Him have an actual reason to celebrate rather than…

  134. Luke 6:22-23

    మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

    Being misunderstood or pushed aside for standing by what is true is not a sign that something has gone wrong; it can be a sign that something real is happening in you.

  135. Job 22:25-26

    అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.

    Treasure can shift from what you own to who you know, and that shift changes everything about how you carry hard days.

  136. Psalms 107:31-32

    ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక

    Give thanks aimed at people who already know you carries a different weight than thanks kept private — which is exactly the company named here, the assembly, the elders, not…

  137. Luke 19:37-38

    ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.

    Loud, public praise breaks out here simply from looking back at what the disciples had already witnessed, even with the hardest week of Jesus' life still ahead of them.

  138. Acts 2:46-47

    మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

    Real joy often shows up in the plainest routines, a shared meal, familiar faces, an ordinary day repeated with people who care about you.

  139. Psalms 92:1-3

    యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.

    Gratitude here is scheduled, not spontaneous — morning and night, whether the day between them went well or badly.

  140. Luke 2:9-11

    ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు

    Fear was the first response to that night's announcement, and joy came right behind it — because the news was too good to stay frightening for long.

  141. Psalms 96:10-12

    యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.

    The world does not hold together because circumstances feel stable — it holds together because God reigns over it, unshaken by whatever unsettles you.

  142. 1 Thessalonians 5:16-18

    ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

    Joy, prayer, and gratitude here are not feelings you wait to arrive naturally — they are postures you can choose even in an ordinary or difficult day.

  143. Psalms 103:20-22

    యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

    Praise here moves in a widening circle — angels, heavenly armies, everything God has made, and finally, personally, your own soul included in the same call.

  144. Psalms 126:1-4

    సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు. దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.

    Some joy feels almost too good to be real at first — like waking from a dream you cannot quite believe was true.

  145. Psalms 98:6-9

    బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

    This is worship too big to stay quiet — seas roaring, rivers clapping, hills breaking into song, all before a King who is coming to set things right.

Telugu text: Bible Society of India Telugu Bible. English text (NKJV) is shown per verse on the promise page, not reproduced here. Reflections and prayers are UECF originals. Audio: the voices recorded for the Daily Bible Promises.