🌿 Promises of Healing

44 Bible promises on healing — the Telugu text, the opening of each reflection, and four narrated voices. Open any promise for the full reading in English and Telugu, the reflection and the prayer.

  1. Jeremiah 17:14

    యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.

    Prayer like this hands the outcome over instead of negotiating for it.

  2. Psalms 147:3

    గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.

    Read a little further and this psalm has God counting the stars, which makes the tenderness here remarkable: the One who orders galaxies bends over a broken heart.

  3. Isaiah 53:5

    మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

    Someone absorbed what was owed so that you would not have to.

  4. Exodus 15:26

    మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగ జేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.

    God introduces Himself here by a name rather than a policy: the One who heals.

  5. James 5:15

    విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.

    Illness tends to make people withdraw, and the direction here is the opposite — toward others praying over you.

  6. Psalms 30:2

    యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.

    Crying out is not weakness; it is the beginning of help.

  7. Psalms 103:2-5

    నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు ¸యౌవనమువలె నీ ¸యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

    Forgetting is our common failing, not of facts but of mercies.

  8. Psalms 107:20

    ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.

    A word from God reaches where medicine cannot.

  9. Proverbs 4:20-22

    నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

    What you allow into your mind affects more than your thinking.

  10. Proverbs 17:22

    సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.

    Your inner life has physical consequences.

  11. Isaiah 58:8

    వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

    Dawn does not negotiate with the night; it simply comes.

  12. Jeremiah 30:17

    వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

    Being written off by other people does not settle your case.

  13. Jeremiah 33:6

    నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

    Healing is more than the removal of symptoms.

  14. Hosea 6:1

    మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

    Turning back is always possible, even from a place you feel you deserve.

  15. Hosea 14:4

    వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.

    Freely is the astonishing word here.

  16. Malachi 4:2

    అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

    Long winters do end.

  17. Matthew 8:17

    ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.

    Christ never treated human sickness from a safe distance.

  18. Ezekiel 34:16

    తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

    Shepherds go looking.

  19. Ezekiel 36:26

    నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

    Some things cannot be improved, only replaced.

  20. Luke 4:18-19

    ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

    Broken hearts stand near the top of His stated purpose, along with the poor, the captive, the blind, the pressed-down.

  21. James 5:16

    మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.

    Hiding makes a wound heal slowly.

  22. Psalms 41:3

    రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.

    Sickrooms can feel like forgotten places, far from where life is happening.

  23. Isaiah 1:26

    మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

    God restores by returning things to what they were always meant to be, not by patching over what went wrong.

  24. Psalms 119:25

    (దాలెత్‌) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.

    There are days when even lifting your head feels beyond you.

  25. 2 Chronicles 7:14

    నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

    Healing often starts further back than we expect: with humility, with turning, with the honest prayer we have been avoiding.

  26. Exodus 23:25

    నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.

    Worship is not a transaction that buys good health, yet God binds the life turned toward Him to a life He tends.

  27. Ezekiel 47:9

    వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.

    Life spreads wherever God's presence flows, and even water long considered dead becomes fresh again.

  28. Hosea 6:2

    రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.

    Waiting for God to act can feel far longer than a few days, but His restoring never arrives late.

  29. Jeremiah 31:18

    నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

    Correction from God is never rejection.

  30. Job 33:26

    వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.

    Prayer offered from a low place does not embarrass God; He delights in the one who comes.

  31. Luke 8:48

    అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.

    Jesus never treats a person as a case to be fixed.

  32. Mark 5:34

    అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.

    Years of suffering can reshape how you see yourself, until the illness feels like your identity.

  33. Matthew 9:6

    అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా

    Forgiveness and healing flow from the same authority.

  34. Isaiah 30:26

    యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

    A day is coming when God's healing will be so complete that the whole world looks brighter for it.

  35. Psalms 143:11

    యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికిం పుము నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పింపుము.

    There are prayers you pray with no confidence in yourself at all, and this is the shape of them: asking God to act because of who He is.

  36. Isaiah 33:24

    నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

    Sickness and guilt both leave a person weary, and God has promised a future where neither one remains.

  37. Psalms 41:4

    యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.

    Some wounds are self-inflicted, and those are the hardest to bring into the open.

  38. Isaiah 38:16

    ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

    Hard experience does not only take from you — in God's hands it teaches the spirit how to live.

  39. Psalms 80:19

    యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.

    Restoration is not something you can manufacture inside yourself; it comes when God turns His face toward you.

  40. Isaiah 57:18

    నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

    Your ways are fully known to God, and still His answer is to heal rather than to shame.

  41. Isaiah 19:22

    యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.

    Some pain in your life may be doing something you cannot yet see, breaking down what needed to change so healing can actually take root.

  42. Luke 4:40

    సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.

    Sunset had already come and the line of sick people was surely long, yet no one in it is turned away or told to come back tomorrow.

  43. Isaiah 35:5-6

    గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

    What feels permanently broken in you is not outside what God can restore — sight, hearing, strength to move freely, none of it is beyond Him.

  44. Psalms 6:1-4

    యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.

    This is a prayer that does not pretend to be strong — it says plainly, I am weak, my body and spirit are shaken, come near.

Telugu text: Bible Society of India Telugu Bible. English text (NKJV) is shown per verse on the promise page, not reproduced here. Reflections and prayers are UECF originals. Audio: the voices recorded for the Daily Bible Promises.