🙏 Promises of Faith

94 Bible promises on faith — the Telugu text, the opening of each reflection, and four narrated voices. Open any promise for the full reading in English and Telugu, the reflection and the prayer.

  1. Hebrews 11:1

    విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.

    Faith is not pretending to be certain about things you secretly doubt.

  2. Mark 11:24

    అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

    Confident prayer is not a technique for getting what you want; it grows from knowing the One you are asking.

  3. Romans 10:17

    కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

    Belief grows the way a language is learned — by hearing it again and again until it becomes your own.

  4. Matthew 17:20-21

    అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

    The size of your faith matters far less than the size of the One it rests on.

  5. Ephesians 2:8-9

    మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

    Grace undoes the exhausting effort of trying to earn God's approval.

  6. Genesis 15:6

    అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

    God counted a man righteous not for what he achieved but for whom he believed, and that is still how it works.

  7. Habakkuk 2:4

    వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.

    Pride builds a life on its own strength, and that strength eventually runs out.

  8. Matthew 21:22

    మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

    Believing prayer is not a technique for getting what you want; it is honest asking from a heart that expects God to be good.

  9. Mark 9:23

    అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.

    Faith does not have to be strong to be real.

  10. Luke 1:37

    దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.

    Impossibility is a category that belongs to us, not to God.

  11. Romans 1:17

    ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

    Standing right with God is a gift received, never a score achieved, and that changes how you get out of bed.

  12. Galatians 2:20

    నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.

    A death came first, and only then a new kind of life.

  13. Ephesians 3:12

    ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.

    Access to God is not rationed according to how well your week has gone.

  14. Ephesians 6:16

    ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.

    Sharp thoughts arrive without warning: you are a failure, God has forgotten you, nothing will ever change.

  15. 1 Timothy 6:12

    విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

    Some days believing feels less like resting and more like fighting for ground that is already yours.

  16. Hebrews 11:6

    విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

    God is not hard to find, though He does ask to be sought.

  17. James 1:6

    అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

    Divided asking leaves you tossed about, wanting God's answer while quietly planning around Him.

  18. 1 John 5:4

    దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే

    Victory is not something you achieve by being stronger than your circumstances; it already belongs to a life born of God.

  19. 2 Chronicles 20:20

    అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడియూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.

    Believing God before you see the outcome is the hardest kind of trust, and it is the kind that steadies you.

  20. Psalms 37:3

    యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

    Faithfulness is something God offers as daily nourishment, not as a reward for the strong.

  21. Luke 17:6

    ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.

    Small faith in a great God accomplishes more than great confidence in yourself.

  22. Galatians 3:26

    యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.

    Adoption papers do not get revised when a child has a bad week.

  23. Philippians 3:9-11

    క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయ ములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

    There is a deep relief in giving up the effort to justify yourself.

  24. Colossians 2:6-7

    కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.

    A living faith is not a single decision left behind years ago; it keeps growing downward while it grows upward.

  25. 1 John 5:14-15

    మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.

    Prayer is not a shout into an empty room.

  26. Psalms 108:1

    దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.

    A settled heart is not one that feels no trouble; it is one that has decided where it stands.

  27. John 12:46

    నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

    Coming to Christ does not mean darkness never touches you; it means you no longer have to live inside it.

  28. Galatians 3:11

    ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

    Trying harder has never yet made anyone right with God, and it will not begin working today.

  29. Isaiah 11:5

    అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

    Every ruler is held together by something, and with Christ it is righteousness and complete reliability.

  30. Luke 1:45

    ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

    Believing before there is any evidence is the hardest and most honoured kind of trust.

  31. Matthew 25:21

    అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను.

    Small responsibilities handled well are how God measures a life, not by the size of the task but by the care taken over it.

  32. Jeremiah 33:3

    నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.

    An open invitation stands: ask, and He will answer with things you could never have worked out alone.

  33. 1 Corinthians 1:9

    మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు.

    Your place with God rests on His reliability rather than on yours, which is an enormous relief on days when you have little to offer.

  34. 1 John 2:28

    కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.

    Confidence before God is not something you manufacture at the last minute; it grows quietly out of staying close to Him now.

  35. 2 Timothy 2:11

    ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.

    Whatever you have surrendered for Christ is not lost; it is planted.

  36. Acts 27:25

    కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.

    Faith becomes contagious in a crisis.

  37. Deuteronomy 4:35

    అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.

    Certainty about God is not something you must manufacture — He has shown Himself so that you could know Him, not merely guess at Him.

  38. Habakkuk 1:5

    అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.

    God is already at work in places your eyes have not yet reached, and much of it would surprise you if you could see it now.

  39. Hebrews 10:22

    మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.

    You do not have to clean yourself up before you come to God, because the washing has already been done for you.

  40. James 4:8

    దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.

    Half a heart is a hard way to live, pulled between what you say you want and what you actually chase.

  41. Mark 11:23

    ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    Some obstacles are too large to argue with and too fixed to move by your own effort.

  42. Micah 7:20

    పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు.

    Promises made generations ago still hold, because the One who made them does not change His mind with the passing years.

  43. Psalms 111:3

    ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

    Human work wears out.

  44. John 14:12

    నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    It is easy to assume the important work belongs to other people — the gifted, the trained, the ones out front.

  45. Galatians 3:8

    దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

    Long before you were born, before your country or your language existed, God had already decided to include you.

  46. Isaiah 42:8

    యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.

    There is a kind of jealousy that is pure love, and God will not hand you over to anything smaller than Himself.

  47. Luke 16:13

    ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.

    Money makes an exhausting master.

  48. Matthew 25:23

    అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమా నుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.

    Small responsibilities, carried well and noticed by no one, matter far more than they appear.

  49. Jeremiah 50:5

    ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.

    Coming home to God is possible even after a long distance and a longer silence.

  50. Psalms 119:160

    నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.

    Opinions shift, advice contradicts itself, and what everyone was certain of last year has quietly changed.

  51. John 20:29

    యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

    Believing without seeing is not a lesser kind of faith; Jesus called it blessed.

  52. Galatians 3:9

    కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

    You belong to a long line of people who took God at His word and were carried by it.

  53. Isaiah 43:10

    మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

    God chooses ordinary people rather than impressive ones, and He chooses them so they can come to know Him instead of perform for Him.

  54. Luke 17:19

    నీవు లేచిపొమ్ము, నీ విశ్వా సము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.

    Gratitude has a way of completing what mercy begins.

  55. Matthew 9:22

    యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.

    Jesus turned around for one woman in a crowd that was pressing in on every side.

  56. Psalms 119:90

    నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది

    The steadiness that keeps the earth turning under your feet is the same steadiness God brings to His promises.

  57. John 6:69

    నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

    Many walked away that day and a few stayed, not because they had every answer but because they had come to know Him and had nowhere better to go.

  58. Psalms 135:13

    యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.

    Names fade from memory faster than we expect; a generation or two and even those we loved are half forgotten.

  59. Psalms 145:13

    నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.

    Governments change, borders shift, and powers that look permanent turn out to have an expiry date.

  60. Psalms 26:11

    నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.

    Integrity and mercy are not rivals.

  61. Psalms 40:8

    నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

    Obedience changes character when it moves from duty into desire.

  62. Psalms 5:7

    నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను

    Access to God has never been earned by anyone who came through His doors.

  63. Psalms 55:17

    సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును

    Prayer does not need a schedule to be heard, though a rhythm steadies a troubled mind.

  64. Psalms 57:7

    నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.

    A settled heart is something God gives; it is not something you summon by willpower.

  65. Psalms 66:20

    దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.

    Looking back is one of the surest ways to gather courage for what lies ahead.

  66. Psalms 71:22

    నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను.

    Music can carry gratitude that plain words are too small to hold.

  67. Psalms 78:4

    యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

    Faith travels best in stories told at home.

  68. Psalms 89:1

    యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.

    Singing about the mercy of God is a decision as much as a mood, and it is often made on days when little feels worth singing about.

  69. Psalms 89:2

    కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.

    Mercy is not a mood God is in today and out of tomorrow.

  70. Psalms 98:3

    ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.

    Waiting long enough to wonder whether you have been forgotten is a particular kind of pain.

  71. Psalms 40:3

    తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.

    What God does for you rarely stops with you.

  72. Hebrews 13:7

    మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.

    The faith you carry today was shaped by someone who walked this road before you — a parent, a teacher, a friend who showed you what trust in God looks like.

  73. 1 Thessalonians 2:13

    ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

    Some words just inform you, and other words get inside you and start changing how you live — this is about the second kind, truth that does not stay theoretical once you receive…

  74. 1 Timothy 3:13

    పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.

    Boldness is not usually where you start — it grows out of faithful service in roles that might feel small or thankless at the time.

  75. 2 Timothy 2:13

    మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.

    Your faithfulness to God can waver, some days more than others, but His faithfulness to you was never dependent on your consistency in the first place.

  76. 2 Timothy 2:22

    నీవు ¸యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

    Growing in faith is not just about avoiding what is harmful; it is just as much about actively chasing what is good — integrity, love, peace, a clear conscience.

  77. Hebrews 10:39

    అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

    There is a pull, when life gets hard, to quietly step back from faith rather than keep holding on.

  78. Psalms 63:1-2

    దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

    Thirst this honest is not hidden here or explained away; it is spoken plainly, and it becomes the very thing that sends the psalmist looking for God early, before anything else…

  79. Job 42:2-3

    నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.

    Faith does not require you to understand everything before you trust it — sometimes it looks like admitting you spoke about things beyond your grasp and trusting God anyway.

  80. 2 Corinthians 5:6-7

    వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.

    Confidence does not require seeing the outcome clearly — that has never been how faith works.

  81. Proverbs 20:6-7

    దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

    Real faithfulness is rarer than people's claims about themselves would suggest, and that can make you wonder if it exists at all.

  82. Psalms 27:7-8

    యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.

    Faith often begins as a response to an invitation, not the other way around — God says seek Me, and something in you answers yes before you have fully worked out why.

  83. Psalms 40:9-10

    నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.

    Three times in these lines the psalmist insists on what he refused to do — restrain, hide, conceal — as if staying quiet about God's faithfulness would have been the easier, safer…

  84. Romans 10:11-12

    ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

    Faith does not run out depending on your background or how qualified you feel; God's welcome is exactly as wide for you as it is for anyone else who calls on Him.

  85. John 14:14-15

    నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.

    Love for Jesus and obedience to Him are not separate tracks; one naturally produces the other, the way asking Him for something is bound up with actually following Him.

  86. Matthew 19:25-26

    శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.

    Some situations look genuinely impossible from where you are standing, and it is honest to admit that instead of pretending otherwise.

  87. Luke 18:26-27

    ఇది వినినవారు ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.

    Disciples ask this question after watching something look genuinely impossible, and Jesus does not correct their assessment — he simply moves the possibility out of human hands…

  88. Mark 10:26-27

    అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి ఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

    It is one thing to accept your own limits and another to trust that God is not limited by them.

  89. Proverbs 31:30-31

    అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.

    Appearance fades and charm can mislead, but a life shaped by reverence for God carries a weight that outlasts both.

  90. John 7:37-38

    ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

    You know the difference between being thirsty for something you cannot name and actually being satisfied; most things you reach for only manage the first for a little while.

  91. Psalms 148:4-6

    పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.

    Something that has held together, unshaken, since the moment it was spoken is a strong reason to trust the smaller word God has spoken over your life.

  92. John 8:30-32

    ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

    Freedom, in this promise, does not come from figuring everything out on your own — it comes from staying rooted in what Jesus has already said, letting His words shape how you see…

  93. Psalms 119:136-138

    జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. (సాదె) యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.

    Grief over how far the world has drifted from what is right is not weakness — even in Scripture, tears flow freely over it.

  94. Psalms 89:34-37

    నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.

    Nothing about your own effort determines whether God keeps His word to you.

Telugu text: Bible Society of India Telugu Bible. English text (NKJV) is shown per verse on the promise page, not reproduced here. Reflections and prayers are UECF originals. Audio: the voices recorded for the Daily Bible Promises.