🤗 Promises of Comfort

70 Bible promises on comfort — the Telugu text, the opening of each reflection, and four narrated voices. Open any promise for the full reading in English and Telugu, the reflection and the prayer.

  1. 2 Corinthians 1:3-4

    కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.

    Comfort received rarely stays still; it looks for someone else to reach.

  2. Psalms 23:4

    గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

    Watch what happens as the darkness closes in: the speaker stops talking about God and starts speaking directly to Him.

  3. Matthew 5:4

    దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

    Grief is not a failure of faith; Jesus calls those who mourn blessed, which means the tears themselves are not held against you.

  4. Isaiah 66:13

    ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

    A mother's tenderness is how God chooses to describe the way He draws near — not scolding, not fixing, simply holding until the crying eases.

  5. Psalms 34:18

    విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

    Broken things are usually pushed aside; God moves toward them.

  6. John 14:1

    మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి.

    Jesus said this on the night before He suffered, to friends about to lose everything they expected.

  7. Psalms 27:10

    నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.

    Family can fail you, and for some people that is the oldest wound of all.

  8. Psalms 94:19

    నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.

    Anxious thoughts multiply quickly, especially late at night.

  9. Psalms 119:50

    నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

    Suffering narrows a life until very little reaches in.

  10. Isaiah 40:1-2

    మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

    Comfort is God's own instruction, not merely a kindness we offer each other.

  11. Isaiah 49:13

    శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

    Heaven is not indifferent to your relief.

  12. Isaiah 51:12

    నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?

    Fear of people is quieter than fear of death, and just as controlling.

  13. Isaiah 61:3

    సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

    Exchange lies at the heart of what God does with grief.

  14. Lamentations 3:32-33

    ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.

    Grief that passes through God's hands is never carelessly given.

  15. Matthew 11:28

    ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.

    Weariness is no disqualification for coming to Jesus; it is precisely what He calls.

  16. 2 Thessalonians 2:16-17

    మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.

    Encouragement from God does two things at once: it settles the heart and it steadies the hands.

  17. Revelation 21:4

    ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

    Tears will not be brushed aside at the end; God attends to each one Himself.

  18. Psalms 55:22

    నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

    Carrying and casting are two different postures.

  19. Proverbs 12:25

    ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.

    Words are heavier than we think.

  20. Matthew 11:29-30

    నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

    Following Jesus is not a heavier load than the one you already carry.

  21. John 14:18-19

    మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.

    Abandonment is the fear underneath many other fears.

  22. 1 Peter 5:7

    ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

    The reason you can hand your worries over is that they matter to Him.

  23. Isaiah 12:1

    ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు.

    Something changes in a person when the fear of God's displeasure lifts and you understand you are not being held at arm's length.

  24. Psalms 116:8

    మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

    Rescue is rarely only physical.

  25. Jeremiah 31:13

    వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.

    Grief is not erased by God; it is turned.

  26. Luke 6:21

    ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.

    Blessing, in the words of Jesus, settles on those who have the least reason to feel blessed.

  27. 1 Peter 4:14

    క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

    Being mocked for your faith is not a sign that God has withdrawn from you.

  28. 2 Corinthians 1:7

    మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.

    Suffering shared with Christ never comes without its matching comfort.

  29. Deuteronomy 4:31

    నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.

    Mercy is not a mood God happens to be in; it is who He is.

  30. Genesis 50:21

    కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.

    Kindness where judgement was expected disarms a person completely.

  31. Hebrews 4:16

    గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

    You do not need to approach God apologetically, as though your need were an imposition on Him.

  32. John 16:20

    మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    Around you people may be celebrating while you are quietly falling apart.

  33. Lamentations 3:56

    నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.

    Your cry was heard the moment it left you, even if nothing visible has changed since.

  34. Revelation 14:13

    అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.

    Death, for those who belong to Christ, is not loss but rest, and nothing they gave in love is wasted.

  35. Isaiah 25:8

    మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

    One day the last enemy will be gone and grief will have nothing left to feed on.

  36. Psalms 119:77

    నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.

    Tender mercy is not a luxury for the strong; it is what keeps a struggling person alive.

  37. Jeremiah 31:16

    యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియసఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

    Nothing you have poured into the people you love is lost, however little of it you can see right now.

  38. Luke 7:13

    ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

    Compassion moved Him before anyone asked.

  39. Isaiah 30:19

    సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

    God does not wait for your prayer to be finished before He responds.

  40. Psalms 135:14

    యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.

    Justice and compassion are not at odds in God.

  41. Isaiah 46:4

    ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

    Age changes what you can do; it never changes what God will do.

  42. Psalms 145:18

    తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.

    Nearness is not earned by eloquence but by honesty.

  43. Isaiah 51:3

    యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును

    Wasteland is God's favorite material.

  44. Psalms 27:9

    నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

    Honest prayer sometimes sounds like pleading, and God is not offended by it.

  45. Isaiah 60:20

    నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

    Every light you depend on eventually fades — your energy, your health, the people who hold you up.

  46. Psalms 51:17

    విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

    Brokenness is no disqualification in God's sight; it is what He receives.

  47. Isaiah 62:12

    పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.

    Names given by God tell the truth about you far better than the names given by your circumstances.

  48. Psalms 71:21

    నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము

    Comfort from God is not thin or partial; it comes from every direction at once.

  49. Isaiah 65:19

    నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు.

    Heaven is not only the end of your tears but the beginning of God's own rejoicing over you.

  50. Isaiah 66:2

    అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

    Out of everything He has made, God's attention settles on the person who is lowly and takes His word seriously.

  51. 2 Corinthians 7:4

    మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.

    Comfort and trouble are not shown here waiting for each other; they exist together in this line, joy running directly through real pressure rather than after it lifts.

  52. Psalms 25:7

    నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.

    God does not define you by the mistakes of your younger years or the choices you wish you could undo.

  53. Psalms 42:8

    అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.

    God's kindness toward you does not clock out when the sun goes down.

  54. Job 5:11

    అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.

    Grief does not disqualify you from being lifted — God has a habit of reaching furthest down toward the people who feel most overlooked, carrying mourners toward safety instead of…

  55. Proverbs 25:13

    నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును.

    A trustworthy word arriving at just the right moment can restore more than you expect, and that is exactly what God's presence is meant to be for you today.

  56. 1 Thessalonians 5:14

    సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.

    God does not respond to every person the same way, and he does not expect you to either — what steadies one person crushed by discouragement might not be what a stubborn heart or…

  57. Psalms 139:14

    నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

    Long before you doubted your worth, God had already shaped you with intention, not carelessness.

  58. Malachi 3:16

    అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

    Even a quiet conversation about faith, the kind no one else notices, does not go unnoticed by God.

  59. Psalms 100:3-4

    యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.

    Comfort can start with a simple fact — you did not make yourself, and you belong to someone who claims you as his own.

  60. John 16:6-7

    నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.

    Grief and good news can arrive in the same breath, which is exactly what happens here — sorrow fills the room even as something better is being set in motion.

  61. Psalms 56:8-9

    నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా. నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును.

    Nothing about your wandering, your restlessness, or your private tears has gone unnoticed — God keeps track of what you might assume no one is watching.

  62. Psalms 86:16-17

    నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.

    Asking to be seen, not just helped quietly, is what this request actually wants — a visible sign, something even the psalmist's critics would have to notice and feel embarrassed…

  63. Psalms 102:17-18

    ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు

    No prayer from someone who feels stripped of everything else goes unnoticed by God; He listens especially closely to the ones with nothing left to offer but their need.

  64. Psalms 139:17-18

    దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.

    Before you are even fully awake to the weight of the day, God's attention toward you has already been constant, too vast to count.

  65. 1 John 3:20-21

    ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.

    Your own conscience is not the final judge of your worth before God; He is greater than whatever accusation your heart brings against you.

  66. Matthew 12:20-21

    విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదియే

    A nearly broken thing is not what God crushes further, and a barely burning hope is not what He puts out.

  67. Luke 24:28-29

    ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

    Some of the clearest sense of God's presence comes not from a dramatic moment but from simply asking Him to stay a little longer when the day is ending and you would rather not be…

  68. Psalms 119:92-93

    నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.

    Surviving a hard affliction sometimes depends less on circumstances changing and more on having something steady to hold on to, the way God's word was for the person praying this.

  69. Isaiah 54:5-7

    నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన ¸యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

    God does not merely stand near you — He claims you the way a husband claims a bride, with a covenant that does not break under strain.

  70. Matthew 19:13-15

    అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.

    Disciples once underestimated who belonged near Jesus, but He corrected them without hesitation, making room instead of turning anyone away.

Telugu text: Bible Society of India Telugu Bible. English text (NKJV) is shown per verse on the promise page, not reproduced here. Reflections and prayers are UECF originals. Audio: the voices recorded for the Daily Bible Promises.