#85

క్రీస్తును కొలుచుట

రచయిత: కాజా అనంతము

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
చేరి కొలవండి – క్రీస్తుని పాదములు – చేరి కొలవండిచేరి కొలవండి – స్థిర మతితో మీ – నోరు నిండ మది – కోరిక తీర ||చేరి||
చరణము 1
సత్ప్ర చరిత్రతో – దారుణ పాతక – నిపుణుడు శుద్ధ – చారుండతడని ||చేరి||
చరణము 2
దేవుని కుమారుడు – ధీవిస్తారుడు – సేవ కావనుడు క్షేమకరుడని ||చేరి||
చరణము 3
యేసుని వారల – నిశీధమున మన్నన – చేసి తప్పు క్షమ – చేయును గాన ||చేరి||
చరణము 4
మరణము నొందిన – నరులను గృపతో – గ్రమ్మర బ్రతికించిన – మహిమోజ్వలుని ||చేరి||
చరణము 5
పలు దయ్యంబుల – బారదోలి రో – గుల రక్షించిన – మలినాపహుని ||చేరి||
చరణము 6
జను లాశ్చర్యమొంద – మూగకు నో – రును గన్నుల వింత – కు నడిపిన వాడని ||చేరి||