#84

నీతి సూర్యుడు

రచయిత: చెట్టి భానుమూర్తి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఇదిగో నీతి భాస్కరుండు – ఉదయమాయె నతని నీతి హృదయ కమలములను నిలిచిమది తమో గుణంబులను బాపి – సదమల జ్ఞానంబు నొసగ ||ఇదిగో||
చరణము 1
ఎవని జ్ఞాన మహిమ విభవ – మెవని నీతి బల ప్రకాశ – మెవని మనుజ రూపమాయె – నవవినీత సత్యవర్తి – రవిని మించు తేజమూర్తి ||ఇదిగో||
చరణము 2
నరజనముల నీతియెవడో – ధరణిపతుల దీప్తియెవడో – దురిత భవనము దీర్చునెవడో – పరమపురుషుడు యేసుడతడే – నిరత జీవమొసగు నిప్పుడే ||ఇదిగో||
చరణము 3
కలుషమెల్ల బాపదలచి – కల్వరి గిరివరకు నడచి – అలవికాని ముక్తి గూర్చన్ – సిలువమీద బలియై మరణ – బలమునణచి తిరిగి లేచే ||ఇదిగో||
చరణము 4
మదితమము భేదకటకరిగి – యెదను కీర్తనము కరిగి – హృదయ రసము అతిశయించి – సాధు గుణము కలిగి యేసు – పాదములను గొలుతు నిప్పుడే ||ఇదిగో||
చరణము 5
జనగణముల జీవమతడే – ధన ఘనముల దాతయతడే – అనుభవమున నెరుగుమతని – అనుపమ ప్రేమామృతంబు – అనవరత ఆనందకరము ||ఇదిగో||