#66
Love Divine, all love excelling
చరణము 1
దైవ ప్రేమ పృథివిలోని యన్నింటిని మించునుయేసు మాలో నివసించు యది మా విముక్తియేనీ అమూల్య ప్రేమ యుండు నీవు దాసులమైన మమ్ముకృపతో రక్షించుము.
చరణము 2
మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువాఎన్నడెన్నడు నీదు సన్నిధిని బాయకుమునిన్ను స్తుతియించుచు మేము సర్వదా సేవింతుమునిన్ను ప్రార్థించి పూర్ణప్రేమ మేమతిశయింతుము.
చరణము 3
క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్ల బాపుముమాకు స్వస్థత నొసంగి గొప్ప రక్షణ చూపుముభక్తి యభివృద్ధి పొంది స్వర్గమందు చేరగావింతనొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు.