#591
అపొస్తలుల విశ్వాస ప్రమాణము
పల్లవి · Pallavi
త్రైక దేవుడు యెహోవా – దేవు – నే నమ్మి సేయుదు సేవ – దేవ పరలోక భూలోక – ముల నెల్ల బుట్టించి – పాలించు తండ్రి దే – వుని నమ్మెదను నేను || త్రైక ||
చరణము 1
శ్రీ దేవసుతుడు యేసు క్రీస్తే – యేక – చిరజీవ నాథుండు నాకే – దేవ కన్య మరియమ్మ గ – ర్భంబున జన్మించిన – కరుణగల దేవుని – గూర్మితో నమ్మెదన్ || త్రైక ||
చరణము 2
పొంతి పిలాతు కాలమున – యేసు – పొంది శ్రమలను సిలువమీద – దేవ కొట్టబడి చనిపోయి – పెట్టబడి భూమిలో – మూడవ దినమందు – మృతి గెలిచి లేచెను || త్రైక ||
చరణము 3
పరలోకమున కెక్కి యేసు – క్రీస్తు – పరమతండ్రికి కుడివైపు – దేవ సింహాసనముమీద – స్థిరముగా గూర్చుండి – యున్నాడు చిరన్యాయ – కర్తయై యున్నాడు || త్రైక ||
చరణము 4
అక్కడనుండి ప్రభు యేసు – వచ్చు – నిక్కముగా దీర్పు దీర్చుటకు – దేవ మరణమొందినవారికి – బ్రతికియున్నవారికి – న్యాయంబు దీర్చును – న్యాయవంతుడు యేసు || త్రైక ||
చరణము 5
శుద్ధాత్మ దేవుని నేను – మన – శుద్ధితో నమ్మి కొల్చెదను – దేవ శుద్ధ సంఘంబు పరిశుద్ధుల సహవాస – మును నమ్మెదను నిత్య – మును నేను నిజమిది || త్రైక ||
చరణము 6
పాపక్షమాపణను నేను – ఎంతో బలముగా నమ్మెద నిలను – దేవ ఈ శరీరంబోయి – యంత్యదినమున మరల – లేచునని స్థిరముగా – వాసిగా నమ్మెద || త్రైక ||
చరణము 7
నిత్యజీవము నమ్మెదను – నేను నిజముగా శ్రీ యేసు పేర – దేవ నిత్యుండు తండ్రి దే – వుండు కుమారుండును – ఆత్ముండు సత్యుండు – త్రేకుడౌ దేవుండు || త్రైక ||