#590
విశ్వాస ప్రమాణము – అపొస్తలుల విశ్వాస ప్రమాణము
పల్లవి · Pallavi
పరలోక భూలోకంబులకును – ప్రభువును సృష్టికర్తయునౌ – పరమ శక్తుడు తండ్రి దేవుని – భక్తితో నమ్ముచు నున్నాను || పరలోక ||
చరణము 1
ఆయన యద్వితీయ సుతుండు – నా యేసుని నమ్ముచునుందు – నాయన పరిశుద్ధాత్మవలన – గానాయ మరియమ్మకు జన్మించె || పరలోక ||
చరణము 2
పొంతి పిలాతు అధికారమున – బొంది సిలువ బాధను మృతుడై – యంతట భూస్థాపనము జేయబడి – యదృశ్య లోకమునకు దిగెను || పరలోక ||
చరణము 3
మరి మూడవ దినమున జన్మపోయిన – మనుజులలో నుండియు లేచి – పరలోకంబున కెక్కి తండ్రి కుడి – పార్శ్వంబున గూర్చున్నాడో || పరలోక ||
చరణము 4
అక్కడనుండి బ్రతికియున్న జనులను – జన్మపోయినవారిని – చక్కగాను విమర్శించుటకును – జను నని నమ్ముచునున్నాను || పరలోక ||
చరణము 5
పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును – పావన సార్వత్రిక సభను – ధర్మనైక్యత పాపక్షమము పునరు – త్థాన సుజీవము నమ్ముదు నామేన్ || పరలోక ||