#588
ఆదివారపు బడి – సంఘపు బడి ప్రాముఖ్యత
పల్లవి · Pallavi
సఖులారా సంఘంపు బడి – సంబంభమునకు నారుమడి – సుఖజీవమిట గనుగొనుడి – చోద్యంపు కథలను వినుడి || సఖులారా ||
చరణము 1
విద్యార్థులకు బోధంబు – వినుడొజ్జలకు మోదంబు – పద్యాలు కీర్తనంబు లభ్యంగ నిదితరుణంబు || సఖులారా ||
చరణము 2
మేలౌ కుటుంబములకు – మితిలేని సంఘములకు – జాల ప్రదేశంబులకు – సన్మార్గమొదపు నెలవు || సఖులారా ||
చరణము 3
పసిబిడ్డలను రావించి – పరిష్వంగమును గావించి – వెసను బ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి || సఖులారా ||
చరణము 4
ఆబాలగోపాలముగ – నా చంద్ర తారకముగ – బైబిలును యుక్తముగా – భరియింపదగు జిత్రముగ || సఖులారా ||
చరణము 5
మన జిహ్వలకు మధురంబు – మన యంఘ్రులకు దీపంబు – మన చేతులకు ఖడ్గంబు – ప్రభున పావన వేదంబు || సఖులారా ||
చరణము 6
శుభవార్తమానంబు విని – సొంపొంద రక్షణ గని – ప్రభు సంఘమున జేరుకొని – పరులన్ రక్షించుడి చని || సఖులారా ||
చరణము 7
ధరణిలో బడులూరుర – స్థాపించబడి పెంపార – పరమాత్ముని మన సార – బ్రార్థింతము హితులారా || సఖులారా ||