#582
వందనార్పణము
పల్లవి · Pallavi
నుతి సేయను లేవే – యో మనసా – నుతిచేయను లేవే క్షితిని దివిని – హితమతిన్ బ్రోచెడి – సుతుని జనకుని – శుద్ధాత్మనిన్ ద్రేయుని || నుతి ||
చరణము 1
సూర్యుని కాంతి – సొంపగు పంటలు – సుకాలక్షేమములు – శోభిల్లు గేహమునన్ – ఆర్య సాంగత్యము – నైశ్వర్యముల నిల – ననుభవింపవే నీవా – యాఢ్యుని పేరిమిని || నుతి ||
చరణము 2
దురితము లందె – దుర్గతి నున్న నీ – కురుతర ప్రేమను – బరమార్ధ మీయను – వరపుత్రు నొసంగిన – వందనీయుండు ప్రభు – మరిమరి మ్రొక్కుమా – పరమోపకారిని || నుతి ||
చరణము 3
జీవము జ్ఞానము – జీవము నొసంగెడు – పావనాత్మను నీకై – పంపిన దేవుడు – కేవల దోష స్వ – భావము మార్చిన – సేవ చేయుమ నీవా – పావనమూర్తికి || నుతి ||
చరణము 4
కరములు పదములు – కనకాదులన్నియు – స్వరమును చిత్తము – స్థిరమగు ప్రేమయు – మరి నీదు హృదయము – పరమాత్మ సేవకై – పరిపూర్ణముగా నిచ్చి – ప్రణుతించుమాయనకు || నుతి ||