#533

స్తుతి గానము

రాగం: జంఝూటి (ఛాయ: పరములోన బరములోన) · తాళం: చాపు

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
చిన్నబిడ్డల విన్నపముల – నెన్నడైన ద్రోయక – పన్నుగా విను కన్న తండ్రిని – సన్నుతింప జేరరే ||చిన్న||
చరణము 1
భూమి మీద మానవునిగా – స్వామి యుండినప్పుడు – ప్రేమతో అనేక మంది – పిల్లల దరిజేర్చెను ||చిన్న||
చరణము 2
చెంత జేర్చి చిన్న పిల్లల – చేతులుంచి వారిపై – ఎంతో దయతో నాశీర్వ – దించె యేసు వారిని ||చిన్న||
చరణము 3
చిన్న పిల్ల పోలికలను – ఎన్నోమార్లు బోధలో – ఎన్నుకొనుటలో మనయం – దున్న ప్రేమ దెలిపెను ||చిన్న||
చరణము 4
పాట పాడి ప్రభుని పేర – కోటి స్తుతుల నియ్యరే – చాటుగాను బాహాటముగాను – మేటి ప్రభుని వేడరే ||చిన్న||