#532
క్రీస్తవ బాలలు – యేసునకు స్తుతి
పల్లవి · Pallavi
చేతులెత్తి వందనములు – చేతు మిప్పుడే యేసు నీకు – రాత్రి పగలందు మమ్ము – ప్రీతితో గాపాడు యేసు ||చేతులెత్తి||
చరణము 1
సుఖమైనట్టి నిద్ర మమ్ము – నొందజేసి రాత్రియందు – సకల మేలులంద జేయు – స్వామి యేసుక్రీస్తూ నీకు ||చేతులెత్తి||
చరణము 2
అన్నవస్త్రములను మాకు – నన్ని వేళలందు నిచ్చి – కన్న తండ్రివలెను బెంచు – చున్న యేసు స్వామీ నీకే ||చేతులెత్తి||
చరణము 3
విద్యా బుద్ధులన్ని ఇచ్చి – వింత వింత వరములిచ్చి – పెద్దల దయలోను మమ్ము – బెంపారజేయు మేసయ్యా ||చేతులెత్తి||
చరణము 4
చిన్నవారి స్నేహితుడుగా – నున్న యేసుస్వామి నీకు – ఎన్నో వేల స్తోత్రంబులు – ఇలలో నెప్పుడు కలుగుగాక ||చేతులెత్తి||