#522

మేలుకొలుపు

రాగం: భూపాలము · తాళం: ఆట · రచయిత: చెట్టి భానుమూర్తి

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
మేలుకొని ఇక లే యేసుని – మేలులన్ నోరార పాడరే బాలబాలికలారా చాలా పాడరే – వేలపాడరే ||మేలు||
చరణము 1
పక్షిగణములు కూడి దేవుని – ప్రేమ నేలను పొగడుచున్నవి – బాపహరుడగు క్రీస్తు చెంతకు – పారుమా – రక్షణ కోరుమా ||మేలు||
చరణము 2
అరుణరాగము వెల్లి విరిసెను – ఆకాశంబున – అచ్చలన్గెను – తరుణముననే లే దేవుని కేగెమా – దీవెన కలుగుమా ||మేలు||
చరణము 3
తెల్లవారెను లోకమెల్లను – తెలివిగొని మునుముందు దేవుని – తల్లి దండ్రియు – గురుడు నీవని తలచుచూ – తగ ధ్యానించుమా ||మేలు||
చరణము 4
జగములెల్లను జంతుజాలము – ల గణితంబగు జీవులెల్లను – సొగసున నోరార బొగడుట చూడుమా – నీవును పాడుమా ||మేలు||
చరణము 5
నీతి భాస్కరుడుదయమాయెను – నూతనజీవన మొసంగను – సతతమతని దాపున నివసింప జూడుమా – తగ జీవించుమా ||మేలు||